Begin typing your search above and press return to search.

వైరల్ ఆర్ట్: రాళ్లు విసురుతున్న పవన్, చంద్రబాబు!

గత వారం రోజులుగా ఏపీలో వాలంటీర్లపై పవన్ కామెంట్లు, ప్రభుత్వం రియాక్షన్, చంద్రబాబు విమర్శల చుట్టూనే రాజకీయాలు నడుస్తున్నాయంటూ కథనాలొస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 July 2023 8:50 AM GMT
వైరల్ ఆర్ట్: రాళ్లు విసురుతున్న పవన్, చంద్రబాబు!
X

గత వారం రోజులుగా ఏపీలో వాలంటీర్లపై పవన్ కామెంట్లు, ప్రభుత్వం రియాక్షన్, చంద్రబాబు విమర్శల చుట్టూనే రాజకీయాలు నడుస్తున్నాయంటూ కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక ఆర్ట్ వర్క్ ఆన్ లైన్ లో వైరల్ అవుతుందని తెలుస్తోంది!

గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో ఫ్లెక్సీ వార్ లు హల్ చల్ చేయడం.. జనసేన ట్విట్టర్ లో సర్కార్ పై సెటైర్స్ వేస్తూ ఆర్ట్ ఫోటోలు ప్రచురించడం తెలిసిందే. వీటికి వైసీపీ నేతలు సెటైరికల్ గా స్పందించిన సంగతీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా వాలంటీర్లపైకి రాళ్లు విసురుతున్నట్లు ఒక పిక్ తెరపైకి వచ్చింది.

అవును... ఒక ఆర్టిస్ట్ తాజాగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుల ఫోటోలతో ఒక పెయింటింగ్ వేశారని తెలుస్తుంది. ఈ ఆర్ట్ వర్క్ లో చంద్రబాబు - పవన్ కల్యాణ్ లు విలేజ్ వాలంటీర్లపై రాళ్లు విసురుతున్నట్లుగా ఆ ఫోటో ఉంది! దీంతో ఈ పిక్ వైరల్ అవుతుందని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రతి పట్టణం, గ్రామాల్లో... గ్రామ/వార్డు వాలంటీర్ల నుండి సేవలు పొందుతున్న అనేక మంది వృద్ధులు, వృద్ధ మహిళలు ఉన్నారన్న సంగతి తెలిసిందే. మరి ముఖ్యంగా పెన్షన్ తో పాటు హెల్త్ సర్వేలు చేసే విషయంలో వారి సేవలు చాలా విలువైనవనే కామెంట్లు వినిపిస్తుంటాయి.

అయితే అలాంటి ఈ వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ - చంద్రబాబు నాయుడు రాళ్లు రువ్వుతున్నట్లు ఆ ఫోటో చిత్రీకరించబడిందని తెలుస్తుంది. ఆ సమయంలో వాలంటీర్లు ఇంటి అరుగులపై కూర్చున్న వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది.

దీంతో... నిస్వార్ధంగా పనిచేసే వాలంటీర్లపై ఇద్దరు వ్యక్తులు తమ స్వప్రయోజనాలు, స్వార్థపూరిత రాజకీయాల కోసం ఆ వ్యవస్థనే అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారన్నట్లుగా ఈ కళాఖండం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయని తెలుస్తుంది.