Begin typing your search above and press return to search.

వైసీపీ మీద మరో మారు హాట్ కామెంట్స్ చేసిన పవన్

నష్టపోయిన ఒక్కొక్కరికి 50వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేసిన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వైసీపీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   24 Nov 2023 9:01 PM IST
వైసీపీ మీద మరో మారు హాట్ కామెంట్స్ చేసిన పవన్
X

తెలంగాణా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి సడెన్ గా విశాఖలో ఎంట్రీ ఇచ్చారు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం విశాఖ చేరుకుంటారని భావించినా ఆలస్యంగా సాయత్రానికి చేరుకున్నారు.

పవన్ విశాఖ రావడం వెనక కారణం ఉంది. ఇటీవల ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారులు అన్ని విధాలుగా విలవిలాడుతున్నారు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరికీ ఇరవై నుంచి ముప్పయి లక్షల కోట్ల రూపాయలలో నష్టం జరిగింది.

దాంతో ప్రభుత్వం ముందుకు వచ్చి ఎనభై శాతం మేర వారికి నష్ట పరిహారం అందించింది. అయితే జనసేన తరఫున పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేయడానికి వచ్చారు. ఒక పార్టీగా ఆయన తన సొంత నిధుల నుంచి ఇవ్వాలనుకోవడం అభినందనీయం అని అంటున్నారు.

నష్టపోయిన ఒక్కొక్కరికి 50వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేసిన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వైసీపీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ మత్య్సకారులను ఒక ఓటు బ్యాంక్ గానే చూస్తోంది అని నిందించారు. తాను మాత్రం అలా చూడను అన్నారు. అయితే వైసీపీని పేరు పెట్టి విమర్శించిన పవన్ ఆ పార్టీతో సహా మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఓటు బ్యాంక్ గానే మత్య్సకారులను చూస్తున్నాయని అనడం విశేషం.

మరి అందులో తెలుగుదేశం ఉందా లేదా అన్నది మాత్రం తెలియదు. అన్ని పార్టీలు అని ఆయన అన్నారు. ఏపీలో బీజేపీ టీడీపీలతో పవన్ పొత్తులో ఉన్నారు. అలాంటిది ఆయన ఇతర పార్టీలకు మత్స్యకారులు ఓటు బ్యాంక్ మాత్రమే అనడం అంటే అది టీడీపీకి కూడా తగులుతుందా అన్నదే చర్చగా ఉంది.

అదే టైం లో నేరుగా వైసీపీని ఆయన టార్గెట్ చేశారు. అది ఎపుడూ ఉన్నదే. మరి టీడీపీ విషయంలో పవన్ ఏమైనా మినహాయింపు ఇచ్చారా లేదా అంటే ఆయన మాటలలో అర్ధాలు వెతుక్కోవాల్సిందే అనీ అంటున్నారు. తాను ఎప్పుడు మత్స్యకారులను ఓట్ బ్యాంకులా చూడలేదని పవన్ స్పష్టం చేయడమూ గమనార్హం.

తనకు మత్య్సకారులు అంతా అన్నతమ్ముడి లాంటి వారు అని పవన్ చెప్పుకొచ్చారు. తాను వారికి ఎప్పుడు కష్టం వచ్చినా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అందుకే తెలంగాణలో బీజేపీ జనసేన ఎన్నికల్లో సమిష్టిగా వెళ్తున్న వేళ అక్కడ ఎన్నికలలో సీరియస్ క్యాంపెయిన్‌ చేస్తున్నా కూడా దాన్ని మధ్యలోనే ఆపి మరీ మత్స్యకారులు కష్టంలో ఉన్నారని వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పడం విశేషం.

మొత్తానికి పవన్ బిజీ షెడ్యూల్ లో రావడం ఒక ఎత్తు అయితే పార్టీ డబ్బుల నుంచి ఆర్ధిక సయం ప్రకటించడం మంచి విషయం అంటున్నారు. ఇక వైసీపీ సహా ఇతర పార్టీలకు మత్య్సకారులు ఓటు బ్యాంక్ అన్న పవన్ మాటలలో ఆయా పార్టీలు ఏంటి అన్నదే చూడాలని అంటున్నారు.