Begin typing your search above and press return to search.

వైసీపీని వదిలేసి టీడీపీ మీద...పవన్ తీరుతో విస్మయం...?

ఆయన వారాహి యాత్ర కూడా తన వ్యూహాల మేరకే సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో భారీ నంబర్ తో అసెంబ్లీలో అడుగుపెట్టాలన్నది పవన్ టార్గెట్.

By:  Tupaki Desk   |   16 Aug 2023 12:40 PM GMT
వైసీపీని వదిలేసి టీడీపీ మీద...పవన్ తీరుతో విస్మయం...?
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన రాజకీయ ధోరణిలో ముందుకు సాగుతున్నారు. ఆయన వారాహి యాత్ర కూడా తన వ్యూహాల మేరకే సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో భారీ నంబర్ తో అసెంబ్లీలో అడుగుపెట్టాలన్నది పవన్ టార్గెట్. అందుకోసం ఆయన ఎంచుకున్న రాజకీయ కార్యక్షేత్రం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రా జిల్లాలు.

ఈ రెండు రీజియన్స్ లో టోటల్ గా 68 దాకా అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా తన పరం అయితే కింగ్ మేకర్ నుంచి కింగ్ గా మారవచ్చు అన్నదే పవన్ స్ట్రాటజీ. అందుకే ఆయన పనిగట్టుకుని మరీ ఈ జిల్లాలలో వారాహి తో టూర్ చేస్తున్నారు. అంతే కాదు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా ఉన్న చోట్ల దున్నేస్తున్నారు.

దీంతోనే ఇపుడు టీడీపీ డైలామాలో పడుతోంది అని అంటున్నారు. పవన్ తిరుగుతున్న జిల్లాలు, సభలు పెడుతున్న నియోజకవర్గాలు అన్నీ కూడా టీడీపీకి పట్టు ఉన్నవే. దాని వల్ల రెండు పార్టీల మధ్య గట్టి క్లాష్ తప్పదని అంటున్నారు. పొత్తులు ఉంటే కూడా సీట్ల షేరింగ్ సరిగ్గా జరగకపోతే ఓట్ల బదిలీ కూడా సక్రమంగా సాగేందుకు వీలు ఉండదని అంటున్నారు.

అయినా సరే పవన్ జనసేనకు పట్టు ఉన్న ప్రంతాలలో పార్టీని పటిష్టం చేసుకునేందుకు దృష్టి పెట్టారు. ఈ సీట్లలో పేచీలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దాంతో తమ్ముళ్ళలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఆందోళన పెరిగిపఒతోంది. తమ సీటు అంటూ ఫైటింగ్ చేసుకుంటే అది చివరికి ఎవరికి మేలు చేస్తుందో తెలియని పరిస్థితి ఉంటుందని కూడా అంటున్నారు.

మరో వైపు చూస్తే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా లేకపోయినా వైసీపీకి రావాల్సిన సీట్లూ ఓట్లూ ఎలాగూ వస్తాయని అంటున్నారు. ఒకవేళ పొత్తులు సరిగ్గా కుదరకపోతే మాత్రం అపుడు వైసీపీకి భారీ రాజకీయ లాభం కలుగుతుందని కూడా ఫ్యాన్ పార్టీ నేతలు అంచనా కడుతున్నారు.

ఇదిలా ఉంటే వైసీపీకి కంచుకోటలుగా ఉన్న రాయలసీమ ప్రాంతాలలో పవన్ టూర్ వేస్తే అది టీడీపీ జనసేనలకు ఉపయోగకరంగా ఉంటుందని ఒక కొత్త వాదనను తెర మీదకు తమ్ముళ్ళు తెస్తున్నారు. ఏపీలో వైసీపీని గద్దె దించాలంటే ఆ పార్టీ బలాన్ని భారీగా తగ్గించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. దానికి బదులుగా ఇద్దరికీ బలం ఉన్న ఒకే చోటనే ఫోకస్ పెడితే అది కాస్తా వికటిస్తే అసలుకే ఎసరు వస్తుందని అంటున్నారు.

అయితే పవన్ మాత్రం ప్రస్తుతానికి తన దృష్టి అంతా ఈ రెండు రీజియన్స్ మీదనే ఉంచారని అంటున్నారు. మరో వైపు చూస్తే రాయలసీమ జిల్లాలలో కూడా బలిజ సామాజికవర్గం ఆది నుంచి టీడీపీకే మద్దతుగా ఉంటూ వస్తోంది. రేపటి రోజున పవన్ కళ్యాణ్ ఆ వైపు గా వారాహిని తిప్పినా ఆ వర్గం జనసేన వైపు అట్రాక్ట్ అయితే మళ్లీ టీడీపీకే ఇబ్బంది అన్న విశ్లేషణలు ఉన్నాయి.

ఇలా కాకుండా వైసీపీకి హార్డ్ కోర్ ఓటు బ్యాంక్ గా ఉన్న ఎస్సీస్, ఎస్టీస్, మైనారిటీస్ ని తిప్పుకోవడం తో పాటు ఆ పార్టీకి గట్టి పట్టున్న చోట్ల వీక్ చేసేలా ఎత్తులు వేస్తేనే పొత్తుల కధకు అర్ధం పరమార్ధం ఉంటుందని అంటున్నారు. మొత్తానికి చూస్తే రెండు రెళ్ళు నాలుగు అనుకుంటూ ఒకే చోట ఉంటే మిగిలిన అంకెలతో పాటు బిగ్ నంబర్ నే వైసీపీ టార్గెట్ చేస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా టీడీపీ కంచుకోటలలో జనసేన చేస్తున్న వారాహి విహారం అనేక చర్చలకు కొత్త సందేహాలకు దారి తీస్తోంది అని అంటున్నారు.