Begin typing your search above and press return to search.

పవన్ కోఆర్డినేషన్ బాబుతోనే...!

ఇక పవన్ కళ్యాణ్ ఈ కో ఆర్డినేషన్ మీటింగ్ కి ముందే చంద్రబాబుతో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలసి చర్చలు జరిపారు.

By:  Tupaki Desk   |   9 Nov 2023 10:54 AM GMT
పవన్ కోఆర్డినేషన్ బాబుతోనే...!
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో జరిగిన తెలుగుదేశం జనసేన తొలి కో ఆర్డినేషన్ మీటింగ్ కి అటెండ్ అయ్యారు. ఆ రోజు మీడియా అటెన్షన్ అంతా ఆ వైపునే ఉంది. మొదటిసారిగా రెండు పార్టీలు కలసి కూర్చుని చర్చించే అంశాలు అంటే చాలానే ఉంటాయని అంతా భావించారు.

అనుకున్నట్లుగా కొంత సంచలనంగానే తొలి భేటీ సాగింది. అయితే విడతల వారీగా మీటింగ్స్ పెట్టాలని అనుకున్నారు. కానీ ఎందుకో కొంత జాప్యం అయింది. రెండవ విడత సమావేశానికి పదిహేను రోజులు పట్టింది. ఈసారి విజయవాడలోని ఒక హొటల్ లో మీటింగ్ ఏర్పాటు చేశారు.

నిజానికి ఈ మీటింగ్ కి పవన్ వస్తారని అంతా ఆశించారు. అయితే ఆయనకు బదులుగా నాదెండ్ల మనోహర్ అటెండ్ అయ్యారు. ఒక విధంగా జనసేనకు కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే అన్నది తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ ఈ కో ఆర్డినేషన్ మీటింగ్ కి ముందే చంద్రబాబుతో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలసి చర్చలు జరిపారు.

అవన్నీ నాదెండ్లకు కూడా తెలుసు. ఎందుకు ఆయన కూడా బాబుతో భేటీలో పాల్గొన్నారు. దాంతో దానికి తగినట్లుగానే ఇపుడు రెండవ భేటీ సాగింది అని అంటున్నారు. ఇక పవన్ అయితే బాబుతోనే కో ఆర్డినేషన్ ని చెప్పినట్లు అయింది అంటున్నారు. నిజానికి పవన్ జనసేన అధినేత హోదాలో టీడీపీ అధినేతతోనే చర్చించాలి అని కూడా అంటూ వచ్చారు.

మొదటి మీటింగ్ కి పవన్ రావడం అంటే బాబు జైలులో ఉండడం వల్లనే అని అంటున్నారు. ఇక రెండవ మీటింగ్ నాటికి బాబు క్వాష్ పిటిషన్ మీద సుప్రీం కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే ఆయన వస్తారని అనుకున్నారు. కానీ అది జరగలేదు. దాంతో అటూ ఇటూ కూడా నంబర్ టూ లతోనే మీటింగ్ జరిపించేస్తున్నారు.

ఇక టీడీపీ నుంచి నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, యనమల రామక్రిష్ణుడు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు తదితర సీనియర్ నేతలు హాజరు కాగా... జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ ఇతర అగ్రనేతలు రావడం జరిగింది.

అటూ ఇటూ ఆరేండుగురు వంతున హాజారైన ఈ భేటీలో ఉమ్మడి, పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా చర్చించారని అంటున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యపోరాటం, ఓటరు జాబితా అవకతవకలపై ఉమ్మడి పోరుకు 100 రోజుల కార్యాచరణకు ప్రణాళిక రూపకల్పన దిశగా చర్చలు సాగాయని తెలుస్తోంది. మొత్తానికి మూడవ కో ఆర్డినేషన్ మీటింగ్ కి అయినా బాబు ఫ్రీగా బయటకు వస్తే పవన్ కూడా పాల్గొంటున్నారు అని అంటున్నారు.