Begin typing your search above and press return to search.

పవన్ పోటీ చేసే స్థానం ఫిక్స్... తమ్ముళ్లకు రిక్వస్ట్!

ఇందులో భాగంగా ఈ ఎన్నికల్లో మరోసారి భీమవరం నుంచి పోటీ చేయనున్నట్లు పవన్ ప్రకటించారని సమాచారం!

By:  Tupaki Desk   |   21 Feb 2024 7:47 AM GMT
పవన్  పోటీ చేసే స్థానం ఫిక్స్... తమ్ముళ్లకు రిక్వస్ట్!
X

ఎంతోకాలంగా జనసైనికులు ఎదురు చూస్తున్న ఒక అంశంపై క్లారిటీ వచ్చిందని తెలుస్తుంది. ఇంతకాలం తమ అధినేత ఎక్కడినుంచి పోటీ చేస్తారు అనే విషయంపై క్లారిటీ లేక పడుతున్న ఇబ్బందుల నుంచి జనసైనికులకు రిలీఫ్ అని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా భీమవారం పర్యటనలో ఉన్న పవన్... వచ్చే ఎన్నికల్లో తాను ఇక్కడ నుంచే పోటీ చేస్తానని.. ఈ విషయంలో టీడీపీ నేతలు సహకరించాలని వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యి కోరారని తెలుస్తుంది.

అవును... వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే స్థానంపై జనసేనాని స్పష్టత ఇచ్చారని తెలుస్తుంది. వాస్తవానికి కొంత కాలంగా పవన్ పోటీచేసే స్థానంపై తీవ్రమైన చర్చ సాగుతోంది. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ భీమవరంతో పాటుగా గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో... ఈ రెండింటిలో ఒక స్థానం నుంచి తిరిగి పోటీ చేస్తారనే చర్చ మొదలైంది.

ఇదే సమయంలో... పవన్ ఈసారి రాయలసీమ నుంచి కూడా పోటీ చేయాలని బాబు సూచించారని అంటున్నారు. దీంతో ఈ సారి గోదావరి జిల్లాలతో పాటుగా రాయలసీమ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో తాను పోటీ చేసే స్థానంపై పవన్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈ ఎన్నికల్లో మరోసారి భీమవరం నుంచి పోటీ చేయనున్నట్లు పవన్ ప్రకటించారని సమాచారం!

గడిచిన ఎన్నికల్లో భీమవరంతో పాటు గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ రెండుచోట్లా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీను చేతిలో 8,357 ఓట్ల తేడాతో పవన్ ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి టీడీపీ కూడా తనకు తోడవ్వడంతో... తనకు గెలుపు కన్ ఫాం అని పవన్ ఫిక్సయ్యారని అంటున్నారు. ఈ క్రమంలో స్థానికంగా నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటున్నారని సమాచారం.

గడిచిన ఎన్నికల్లో భీమవరంలో టీడీపీ, జనసేన కు కలిపి సుమారు లక్షా ఆరువేల పైచులుకు ఓట్లు పోలయ్యాయని.. వైసీపీ అభ్యర్థికి మాత్రం డెబ్భై వేళ పైచిలుకు మాత్రమే వచ్చాయని కాబట్టి... ఈసారి ఇక్కడ పవన్ గెలవడం, అక్కడ నుంచి అసేంబ్లీకి వెళ్లడం ఖాయమని జనసైనికులు నమ్మకంగా చెబుతుండగా... రాజకీయాల్లో 1+1=2 కాదని.. ఈసారి కూడా భీమవరంలో ఫ్యాన్ గిరా గిరా తిరగడం గ్యారెంటీ అని వైసీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

ఇదే సమయంలో జగన్ కూడా ఈసారి భీమవరంలో వైసీపీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నరని అంటున్నారు. ఇక్కడ రీల్ హీరోపై రియల్ హీరోని గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో భీమవరంలో పోరు రసవత్తరంగా ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు.

మరోపక్క పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారు. ఈ టూర్ లో భాగంగా హస్తినలో బీజేపీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారని తెలుస్తుంది. ప్రధానంగా ఎన్నీకలు సమీపిస్తున్న వేళ టీడీపీ, బీజేపీ, జనసేన సీట్ల వ్యవహారంపై బీజేపీ పెద్దలతో చర్చించి పొత్తుపై ఒక స్పష్టత తేవాలని భావిస్తున్నారని అంటున్నారు. ఈ భేటీ అనంతరం చంద్రబాబుతో కలిసి పవన్ హస్తినలో పెద్దలతో భేటీ అయ్యి.. కూటమి విషయంపై స్పష్టమైన క్లారిటీకి రావొచ్చని తెలుస్తుంది.

ఏది ఏమైనా... గత ఎన్నికల్లో ఓడిపోయిన భీమవరం నుంచే పవన్ మరోసారి పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. మరి ఈసారి భీమవరం ప్రజలు పవన్ కి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారనేది వేచి చూడాలి!