Begin typing your search above and press return to search.

ఎంపీగా పవన్ పోటీ...ఈ ప్లాన్ ఎవరిది...!?

ఆ విధంగా రెండు సీట్లకు పోటీ చేయడం ద్వారా 2024 ఎన్నికల ఫలితాల తరువాత తన రాజకీయ భవిష్యత్తుని తిరుగులేనిదిగా మలచుకోవాలని పవన్ పక్కా ప్లాన్ తో ఉన్నారట.

By:  Tupaki Desk   |   27 Feb 2024 9:20 AM IST
ఎంపీగా పవన్ పోటీ...ఈ ప్లాన్ ఎవరిది...!?
X

ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అని ఇప్పటిదాకా ప్రచారం సాగింది. అయితే ఎంపీగా కూడా పవన్ పోటీ చేస్తారు అన్నది ఇపుడు లేటెస్ట్ గా సాగుతున్న మరో ప్రచారం. పవన్ ఈసారి కూడా రెండు సీట్లకు పోటీ చేస్తారు అన్నది బాగా జరుగుతున్న ప్రచారం. అయితే ఆ రెండూ ఎమ్మెల్యే సీట్లకు కాదు, అందులో ఒకటి ఎమ్మెల్యే సీటు అయితే రెండవది ఎంపీ సీటు. ఆ విధంగా రెండు సీట్లకు పోటీ చేయడం ద్వారా 2024 ఎన్నికల ఫలితాల తరువాత తన రాజకీయ భవిష్యత్తుని తిరుగులేనిదిగా మలచుకోవాలని పవన్ పక్కా ప్లాన్ తో ఉన్నారట.

అదేలా అంటే ఎంపీగా పోటీ చేసి గెలిస్తే కేంద్రంలో మూడవసారి వరసగా బీజేపీ అధికారంలోకి వస్తే పవన్ గ్యారంటీగా కేంద్రంలో మంత్రి అవుతారు అని అంటున్నారు. అదే విధంగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడితే రేపటి రోజున టీడీపీ జనసేన కూటమి పవర్ లోకి వస్తే అతి ముఖ్య భూమికను ఆయన పోషిస్తారు అని అంటున్నారు.

ఒక వేళ ఏపీలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాకపోయినా ఎంపీగా గెలిస్తే కేంద్రంలో మంత్రిగా ఉండడం ద్వారా రాజకీయంగా తన పార్టీని అధికారం అండతో కాపాడుకోవచ్చు అన్న ఆలోచనలు పవన్ లో ఉన్నాయని అంటున్నారు. నిజానికి పవన్ కి ఈ సలహా ఇచ్చింది బీజేపీ అధినాయకత్వం అని అంటున్నారు.

మరో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ ని ఎంపీగానే పోటీ చేయమని బీజేపీ కోరిందని టాక్. కానీ ఈ కీలక సమయంలో టీడీపీతో కలసి కూటమి కట్టి ముందుకు వెళ్తున్న నేపధ్యంలో ఎమ్మెల్యేగా పవన్ పోటీ చేయకపోతే ఆయనను అభిమానించే వారితో పాటు ఒక బలమైన సామాజిక వర్గం కూడా కూటమి గెలుపులో ఉత్సాహంగా పాలుపంచుకోదన్న ఉద్దేశ్యంతోనే ఆయన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తున్నారు అని అంటున్నారు.

ఇక టీడీపీ జనసేనకు ఇచ్చిన 24 సీట్లలో అధిక సీట్లు గెలిపించుకుని తన వారికి మంత్రి పదవులు దక్కించుకుని తాను ఎంపీగా గెలిచి కేంద్రంలో మంత్రి కావాలన్న మరో ఆలోచన కూడా పవన్ కి ఉందని అంటున్నారు. అపుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన సీటులో ఉప ఎన్నిక వచ్చినా సునాయాసంగా గెలిపించుకోవచ్చు అన్నది ఉద్దేశ్యంగా ఉందని అంటున్నారు.

ఏది ఏమైనా ఇవన్నీ పుకార్లుగా గాసిప్పులు గానే ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ఏది నిజమో తెలియదు కానీ పవన్ కనుక ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మాత్రం ఆయన మాస్టర్ ప్లాన్ తోనే ఉన్నారన్నది అర్ధం అవుతుంది అని అంటున్నారు. మొత్తం మీద పవన్ పోటీ ఎక్కడ ఆయన ఏమి చేయబోతున్నారు అన్నది ఈసారి అంతా ఒక వ్యూహం ప్రకారమే ఉంటుందని మాత్రం చెబుతున్నారు. చూడాలి మరి ఈ ప్రచారాలు ఈ గాసిప్పులలో ఎంత నిజం ఉంటుందో.