Begin typing your search above and press return to search.

బీజేపీ పెద్దలను హర్ట్ చేసిన పవన్...నెక్స్ట్ స్టెప్ అదే....?

బీజేపీ కూడా అలాగే ఆలోచిస్తోంది అని అంటున్నారు. బీజేపీ జనసేనలా ఇప్పటికిపుడు తేల్చిచెప్పలేదు. ఎందుకంటే ఆ పార్టీ అవసరాలు అలాంటివి.

By:  Tupaki Desk   |   14 Sep 2023 1:30 AM GMT
బీజేపీ పెద్దలను హర్ట్ చేసిన పవన్...నెక్స్ట్ స్టెప్ అదే....?
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా టీడీపీతో పొత్తు ఉంటుందని చెప్పడం పట్ల బీజేపీలో అంతర్మధనం సాగుతోంది. ఏపీ బీజేపీలో ప్రో టీడీపీ యాంటీ టీడీపీ గ్రూపులు ఉన్నాయని అంటారు. ఇక ప్రో టీడీపీ వర్గాలు అంటే ఆ పార్టీలో ఉండే ఇపుడు బీజేపీలోకి వెళ్ళిన వారు. వారంతా జనసేన నిర్ణయం పట్ల స్వాగతిస్తున్నారు. చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసి బీజేపీలోకి వెళ్ళిన ఆదినారాయణరెడ్డి అయితే పవన్ డెసిషన్ భేష్ అంటున్నారు. బీజేపీ కూడా అనుకూలంగా రియాక్ట్ అవుతుంది అని అంటున్నారు.

అయితే ఆదినారాయణరెడ్డి మాటలు ఆయన సొంత అభిప్రాయాలుగానే భావించాలి. మరో వైపు చూస్తే బీజేపీ నూతన కార్యవర్గంలోని మెజారిటీ నేతలు కూడా టీడీపీతో కలసి నడవాలని అనుకుంటున్నారు కానీ కేంద్ర నాయకత్వమే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే పవన్ ఇప్పటికిప్పుడు ఏకపక్షంగా పొత్తు నిర్ణయం ప్రకటించడం ద్వారా బీజేపీకి ఆలోచించుకునే చాన్స్ ఇవ్వకుండా చేశారా అన్న చర్చ అయితే సాగుతోంది.

నిజానికి రాజకీయంగా రాటు తేలిన పార్టీలు పొత్తుల వ్యవహారాన్ని వీలైనంతగా సాగదీసి ఎన్నికల ముందర అప్పటి పరిస్థితులను బట్టి సీట్లను డిమాండ్ చేసి కూటమి కడతాయి. బీజేపీ కూడా అలాగే ఆలోచిస్తోంది అని అంటున్నారు. బీజేపీ జనసేనలా ఇప్పటికిపుడు తేల్చిచెప్పలేదు. ఎందుకంటే ఆ పార్టీ అవసరాలు అలాంటివి.

ఏపీలో వైసీపీతో ఎన్నికల దాకా అయినా మైత్రిని పరోక్షంగా అయినా కొనసాగించాల్సిన అనివార్యత ఉంది. కేంద్ర ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ లేదు, అందువల్ల బీజేపీకి వైసీపీకి ఉన్న తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలు కీలకం అవుతారు. ఇక రాజ్యాంగ సవరణలకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెడితే లోక్ సభలో ఉన్న 22 మంది వైసీపీ ఎంపీలు అవసరం పడతారు.

ఇలా బీజేపీ చాలా స్ట్రాటజీస్ తో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో జనసేన బీజేపీ ఒక కూటమిగా ఉంటే టీడీపీతో సీట్ల బేరంలో ఇద్దరికీ గరిష్ట లాభం జరుగుతుందని బీజేపీ పెద్దల ఆలొచన అని అంటున్నారు. వీలైతే అధి పవర్ షేరింగ్ దాకా డిమాండ్ చేసే స్థాయికి వెళ్తుందని కూడా భావిస్తున్నారు.

గతానికి ఇప్పటికీ టీడీపీ విషయంలో చాలా తేడా ఉందని, ఇపుడు వైసీపీ బలంగా ఉన్న వేళ పొత్తుల అవసరం తమకంటే టీడీపీకే ఎక్కువ కాబట్టి ఆ చాన్స్ తాము తీసుకుని ఏపీలో బలపడాలని బీజేపీ భావిస్తోంది. దాంతో జనసేనను తమ వైపు ఉంచుకుని టీడీపీని వంచాలని చూస్తోంది. అయితే బీజేపీ హై కమాండ్ ఎత్తులను చిత్తు చేసేలా బాబు తిప్పిన రాజకీయ చాణక్యంతో పవన్ ముందే పొత్తు ప్రకటన చేశారు దాంతో బీజేపీ ఇపుడు ఒంటరి అయిపోతోంది.

రేపటి రోజున బీజేపీ తానుగా పొత్తు అని కూటమిలోకి రావాల్సి ఉంటుంది. అపుడు డిమాండ్ ఏమీ ఉండదు సరికదా చంద్రబాబు ఇచ్చే అరకొర సీట్లనే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా జరగడం అంటే జనసేన తొందరపాటే కారణం అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు. గత ఏడాది విశాఖకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ పవన్ని పిలిపించుకుని మరీ ఏకాంతంగా భేటీ అయ్యారు. అపుడు ఆయన ఏపీలో జనసేన బీజేపీ బలపడే విధంగా వ్యూహాలు ఉండాలని చెప్పారని ప్రచారం సాగింది. ఇక ఎన్డీయేలో కీలక మిత్రుడిగా పవన్ని ఆహ్వానించి పెద్ద పీట వేశారు.

కానీ పవన్ మాత్రం టీడీపీ చంద్రబాబు అంటూ ఈ రోజుకు ఓపెన్ అయిపోయారని అంటున్నారు. బీజేపీతో పొత్తు ఉండగానే టీడీపీకి జై కొట్టేసి తన దారి తాను తీసుకున్నారని అంటున్నారు. ఇదే ఇపుడు బీజేపీ పెద్దలను హర్ట్ చేస్తోంది అని అంటున్నారు. దీంతో బీజేపీ కేంద్ర పెద్దలు టీడీపీతో పొత్తుకు ఇక మీదట తాముగా ముందుకు రాలేకపోవచ్చు అని అంటున్నారు. అలా వచ్చి తాము తగ్గి ఉండటం అంటే వారికి ఇష్టం లేకపోవచ్చు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి న్యూట్రల్ గా ఉంటూ ఎన్నికల అనంతర పొత్తుల మీదనే బీజేపీ ఫోకస్ పెడుతుంది అని అంటున్నారు. ఏపీలో టీడీపీతో పొత్తు ఉన్నా అరకొర సీట్లు తప్ప ఏమీ దక్కవు. అందులో ఎన్ని గెలుస్తారో తెలియదు అంటున్నారు. ఇక చంద్రబాబు ఎన్నికల తరువాత ఎలా ఉంటారో బీజేపీ సైతం అంచనా వేయలేని స్థితి.

వన్స్ టీడీపీతో పొత్తు అంటే వైసీపీతో దూరం పెంచుకున్నట్లే. సో బీజేపీ జనసేన టీడీపీ కూటమితో కలవకుండా టీడీపీ వైసీపీ రెండు ఆప్షన్లు ఉంచుకుంటుందనే అంటున్నారు. జాతీయ స్థాయిలో ఏమైనా అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.