పవన్ దెబ్బ: చెప్పులే కదా.. అని లైట్ తీసుకుంటే..!
గిరిజన ప్రాబల్యం ఎక్కువగా ఉన్ననియోజకవర్గాలపై.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎ పవన్ కల్యాణ్ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు.
By: Tupaki Desk | 19 April 2025 8:00 PM ISTగిరిజన ప్రాబల్యం ఎక్కువగా ఉన్ననియోజకవర్గాలపై.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎ పవన్ కల్యాణ్ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. అడవి తల్లి బాట పేరుతో కార్యక్రమాలు ప్రారంభించి.. రహదారుల నిర్మాణం.. మెరుగైన వసతి సౌకర్యం వంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకొనేలా గిరిజనుల మనసుల్లోనూ ఆయన నాట్లు వేస్తున్నారు. ఈ నాట్లు వచ్చే నాలుగేళ్లకు ఏపుగా పెరిగే అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.
సహజంగా సాధారణ జనాలకు.. గిరిజన పుత్రులకు మధ్య తేడా వుంటుంది. తమకు ఏ చిన్న కార్యం చేసినా.. గిరిజనులు సదరు నేతలను వదిలి పెట్టరు. ఇలా.. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి గిరిజనులను ఆకట్టుకున్నారు. అందుకే ఎస్టీ నియజక వర్గాల్లో కాంగ్రెస్‌కు భారీ స్తాయిలో ఓటు బ్యాంకు సమకూరింది. ఇది ఆ తర్వాత.. ఆయన కుమారుడిగా జగన్ నేతృత్వంలోని వైసీపీకి చేరువైంది. ఇక, ఓటు బ్యాంకు కూడా.. వైసీపీకి దక్కింది.
ఇలాంటి ఓటు బ్యాంకుపై కన్నేసిన జనసేన.. గిరిజనులకు చేరువ అవుతోంది. గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో .. రహదారుల నిర్మాణం నుంచి వ్యక్తిగత విషయాల వరకు కూడా శ్రద్ధ తీసుకుంటోంది. తాజాగా గిరిజనుల కు 300 జతల పాదరక్షలను జనసేన అధినేత పవన్ కల్యాణ్... స్వయంగా కొనుగోలు చేసి పంపించారు. వీటిని ధరించిన.. గిరిజనులు మురిసిపోయారు. అయితే... చెప్పులే కదా.. అని తేలికగా తీసుకుంటే పొరపాటే. ఎందుకంటే.. ఇది మనసుకు హత్తుకునే పరిణామం.
చెప్పుల విలువతో సంబంధం లేకుండా.. వాటిని ఇచ్చిన జనసేన అధినేతపై గిరిజనులు మనసు పెట్టు కుని.. ఆయన వైపు మొగ్గు చూపుతున్నారు. కొన్నాళ్లకు పోయే చెప్పులు పంచి ఏం చేస్తారు? అని వైసీపీ లైట్ తీసుకున్నా.. చెప్పులు నిజంగానే కొన్నాళ్లకు పాడై.. పక్కన పడేసినా.. జనసేనపై నా.. ఆ పార్టీ అధినేతగా పవన్‌పైనా.. ఇక్కడి గిరిజనులు పెట్టుకునే మనసు, పెంచుకునే అభిమానం మాత్రం చిరస్థాయిగా ఉంటాయన్నది పరిశీలకుల అంచనా. సో.. వైసీపీకి ఇది పెద్ద మైనస్ కానుంది.
