పవన్ హెచ్చరికలు.. 2 ప్లస్సులు.. 2 మైనస్‌లు!
వైసీపీని హెచ్చరించడం.. ఆ పార్టీని అధికారంలోకి రాకుండా చూస్తామని చెప్పడం ద్వారా జనసేన అధినే త, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి యాక్టివ్ మీడియాలో చర్చకు వచ్చారు.
By: Tupaki Desk | 5 July 2025 3:42 PM ISTవైసీపీని హెచ్చరించడం.. ఆ పార్టీని అధికారంలోకి రాకుండా చూస్తామని చెప్పడం ద్వారా జనసేన అధినే త, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి యాక్టివ్ మీడియాలో చర్చకు వచ్చారు. పవన్ కల్యాణ్ అన్నం త పని చేస్తారా? అసలు.. ఎవరు అధికారంలోకి వస్తారన్నది ఆయన ఎలా నిర్ణయిస్తారు? అనే కోణంలో ఓ వర్గం చర్చిస్తుండగా.. పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలతో యువతను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారని.. అదేసమయంలో కూటమి కట్టుతప్పకుండా కూడా ఈ హెచ్చరికలు ఉన్నాయని మరో వర్గం చెబుతోంది.
ఏతా వాతా ఎలా చూసుకున్నా.. పవన్ కల్యాణ్ చేసిన హెచ్చరికలు.. అన్ని స్థాయి వర్గాల్లోనూ.. చర్చగా అ యితే మారింది. ఈ హెచ్చరికలు.. అనంతర చర్చను గమనిస్తే.. 2 ప్లస్సులు కనిపిస్తున్నాయి. అదే సమయంలో 2 మైనస్‌లు కూడా కనిపిస్తున్నాయి. ముందు ప్లస్సుల గురించి చర్చిస్తే.. వైసీపీకి వార్నింగులు ఇవ్వడం ద్వారా.. తనదైన శైలిలో వ్యాఖ్యలు చేయడం ద్వారా యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నా రన్నది ప్లస్. వాస్తవానికి పవన్ అంటే యువతలో క్రేజ్ ఉంది. దీనిని మరింత పెంచుకునే దిశగా ఆయన వ్యాఖ్యలు పనిచేస్తున్నాయి.
ఇక, రెండో ప్లస్.. కూటమి 15 ఏళ్ల పాటు అధికారంలోనే ఉంటుందని చెప్పడం ద్వారా.. కూటమి పార్టీలు క్షేత్రస్థాయిలో ఎలా కలివిడిగా ఉండాలో పవన్ తేల్చేస్తున్నారు. తద్వారా.. ఏడాది కాలంలోనే కొన్ని నియోజకవర్గాల్లో ఎదురైన పరిస్థితులను ఆయన తన వ్యాఖ్యల ద్వారా సర్దుమణిగేలా చేస్తున్నారు. ఈ రెండు ప్లస్సులు అయితే.. మైనస్‌ల విషయానికి వస్తే.. బలమైన వాయిస్‌తో ప్రతిపక్షాన్ని విమర్శించడం తో తాను చేస్తున్న మంచి.. లేదా చేస్తున్న అభివృద్ది పనుల తాలూకు చర్చ లేకుండా చేసుకుంటున్నార న్నది పరిశీలకులు చెబుతున్నమాట.
ఇక, రెండో విషయానికి వస్తే.. కాపు నాయకులు.. ఇప్పుడు కాకపోతే.. మరో ఎన్నికల్లో అయినా.. తమకు సీఎం పదవి దక్కుతుందని.. తామే అధికారంలోకి వచ్చేస్థాయికి ఎదుగుతామని లెక్కలు వేసుకుంటున్నారు. కానీ.. 15 ఏళ్ల కూటమి ప్రకటనతో వారు నీరుగారుతున్నారన్నది క్షేత్రస్తాయిలో కనిపిస్తున్న వాస్తవం. గత ఎన్నికల్లో ఒకే ఒక్క కారణంగా కాపులు ఏకమయ్యారు.
'మనకు అనుభవం లేదు.. కాబట్టి..' అన్న పవన్ వ్యాఖ్యలతో వారు ఆయన వెంట నడిచారు. మరి ఇప్పుడు ఐదేళ్ల తర్వాత.. కూడా అనుభవం రాకుండా ఉంటుందా? అనేది వారి మాట. సో.. పవన్ చేసిన వ్యాఖ్యలు, హెచ్చరికలు పార్టీకి, వ్యక్తిగతంగా ఆయనకు రెండు రకాలుగా ప్లస్ అయితే.. మరోరెండు రకాలుగా మైనస్ అవుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.