పవన్ వారి గుండెల్లో నిద్రపోతారా ?
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి భూ అక్రమార్కుల మీద కబ్జా కోరుల మీద మూడో కన్ను తెరిచారు.
By: Tupaki Desk | 21 April 2025 3:00 AM ISTజనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి భూ అక్రమార్కుల మీద కబ్జా కోరుల మీద మూడో కన్ను తెరిచారు. ఇక వారి ఆటలు సాగవని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. ఏపీలో ఎక్కువ అవుతున్న భూ కబ్జాలు దందాల మీద తాజాగా పవన్ సీరియస్ అయ్యారు. దాంతో ఆయన తొందరలో జిల్లా టూర్లు చేపడతాను అని తన దగ్గరకు వచ్చే కబ్జా ఫిర్యాదుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పై దాటింది. అయితే ఏపీలో అనేక చోట్ల భూ కబ్జాలు జరుగుతున్నాయని జనసేన ఆఫీసుకే నేరుగా ఫిర్యాదులు చేస్తున్నారు. తమ పేరుగా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి మరీ దందాకోరులు ఈ విధంగా భూములు దోచుకుంటుంటున్నారు అని అంటున్నారు.
దీంతో పవన్ ఏకంగా అధికారులతో టెలి కాంఫరెన్స్ నిర్వహించారు. తాను జిల్లా పర్యటనలు చేస్తాను అని కూడా వారికి స్పష్టం చేశారు. ప్రత్యేకించి భూ కబ్జాల మీదనే ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తాను అని చెప్పారని ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే కాకినాడ విశాఖ జిల్లాలలో భూ కబ్జాల మీద ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు పవన్ సమాయత్తం అవుతున్నారని అంటున్నారు. ఆయన కలెక్టర్ జాయింట్ కలెక్టర్ల సమక్షంలోనే ఈ విధంగా చేస్తారు అని అంటున్నారు. అంటే మొత్తం అధికారికంగానే అన్న మాట.
సరైన డాక్యుమెంట్లు లేకుండా కబ్జాలకు పాల్పడేవారి మీద సీరియస్ యాక్షన్ ఉంటుందని అంటున్నారు. భూ దందాల వల్ల ఇబ్బంది ప్రభుత్వానికి వస్తుందని అంటున్నారు. అందుకే పవన్ ఈ విషయంలో తానే స్వయంగా రంగంలోకి దిగాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ కనుక కీలక జిల్లాలలో పర్యటన సందర్భంగా భూ దందాల మీద యాక్షన్ తీసుకుంటే అక్రమార్కుల గుండెలలో రైళ్ళు పరిగెడతాయని అంటున్నారు. నిజంగా కనుక పవన్ తలచుకుంటే భూబకాసురుల ఏరివేత కచ్చితంగా జరిగి తీరుతుంది అని అంటున్నారు.
గతంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసేవారు. ఇపుడు సామాన్యుల భూములు తీసుకుంటున్నారు. అమాయకుల భూములను ఆక్రమిస్తున్నారు. దీని కోసం తమ రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తున్నారు తప్పుడు డాక్యుమెంట్లను క్రియేట్ చేస్తున్నారు. ప్రతీ జిల్లాలో ఈ విధంగా భూబకాసురుల బాధితులు అధిక సంఖ్యలో ఉన్నారు.
వీరి విషయంలో కచ్చితంగా ఒక చూపు చూడాల్సిందే అని అంటున్నారు. మరి పవన్ ప్రకటించారు. ఎపుడు జిల్లాల టూర్లకు వస్తారు, భూ దందాల మీద ఏ రకమైన యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తారు అన్న దాని మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
నిజంగా పవన్ ఈ విధంగా చేస్తే కనుక అది రాజకీయ సంచలనమే అవుతుంది అని అంటున్నారు. ఎక్కువ కేసులు కానీ వివాదాలు కానీ భూముల చుట్టూనే ఉన్నాయని అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న వారే జోక్యం చేసుకుని సరి చేస్తే అన్నీ ఒక కొలిక్కి వస్తాయని అంటున్నారు. సో పవన్ వారి గుండెలలో నిద్ర పోతారు అన్న మాట. వెయిట్ అండ్ సీ.
