Begin typing your search above and press return to search.

పవన్ ఇలా వచ్చి... అలా వెళ్ళి !

విశాఖలో జరిగిన అంతర్జాతీయ యోగా డే వేళ పవన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   22 Jun 2025 9:00 AM IST
పవన్ ఇలా వచ్చి... అలా వెళ్ళి !
X

విశాఖలో జరిగిన అంతర్జాతీయ యోగా డే వేళ పవన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు అని అంటున్నారు. ఇక నెల రోజుల్లో విశాఖలో యోగా డే జరిగినా ఆయన ఈ వైపునకు రాలేదు. పెద్దగా ప్రకటనలూ విడుదల చేయలేదు. ఆయన మీడియా ముఖంగా కూడా ఇటీవల కాలంలో కనిపించడం లేదు.

ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో జరిగే యోగా డేకి ముఖ్య అతిధిగా వస్తున్నారు అన్న నేపధ్యంలోనే పవన్ విశాఖకు వచ్చారా అని చర్చ సాగుతోంది. ఆయన ముందు రోజు సాయంత్రం విశాఖకు చేరుకుని మోడీకి స్వాగతం పలికారు. ఆ తరువాత తనకు కేటాయించిన ప్రైవేట్ హొటల్ లో బస చేశారు. ఇక శనివారం తెల్లవారుతూనే ఆయన విశాఖ బీచ్ కి వచ్చారు. మోడీ చంద్రబాబులతో పాటు ఆయన కూడా ప్రసంగం చేశారు. మోడీని దార్శనీకుడిగా కొనియాడారు.

అనంతరం ఆయన యోగాసనాలు వేశారు. ప్రధానికి జ్ఞాపికను ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన కలసి అందించారు. ఇక ఆ తరువాత ప్రధాని వీడ్కోలు చూసుకుని పవన్ కూడా వెళ్ళిపోయారు అని అంటున్నారు. పవన్ విశాఖలో అలా తక్కువ సమయం గడపడం పట్ల చర్చ సాగుతోంది ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే యోగా డే సందర్భంగా మెగా ఈవెంట్ బీచ్ రోడ్డులో పూర్తి అయ్యాక కలెక్టరేట్ చేరుకుని అక్కడ గంట పాటు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి అనేక మంత్రి మంత్రులు కూడా హాజరయ్యారు.

యోగా డే సూపర్ సిక్స్ కావడం మీద చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ ఎన్నో విషయాలను మీడియాతో పంచుకున్నారు. మరి ఈ కీలక ప్రెస్ మీట్ కి పవన్ హాజరు కాకపోవడం పట్ల చర్చ సాగుతోంది. ఇక విధంగా విశాఖ బీచ్ రోడ్ లో జరిగిన అంతర్జాతీయ యోగా డే సందర్భంగా వేదిక మీద పవన్ కళ్యాణ్ ఇద్దరు కేంద్ర మంత్రుల తర్వాత నిలబడటం కూడా చర్చనీయాంశంగా ఉంది.

మోడీ పక్కన ఒక వైపు చంద్రబాబు ఉంటే ఆయన పక్కన పవన్ ఉండాల్సి ఉంది. అయితే మరో వైపు గవర్నర్ నజీర్ ఉంటే ఆయన పక్కన టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. బాబు పక్కన కూడా బీజేపీ కేంద్ర మంత్రులు ఉన్నారు. దాంతో పవన్ ఒక వైపు చివరన ఉండాల్సి వచ్చిందని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ ఇలా వచ్చారు అలా వెళ్ళారు అన్నట్లుగానే ఆయన విశాఖ టూర్ సాగింది. అదే సమయంలో ఆయన ఫుల్ ఫోకస్ ఏదీ యోగా డే మీద పెట్టలేదా లేక ఆయన ముద్ర బలంగా పడలేదా అన్న చర్చ అయితే సాగుతోంది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగానే పవన్ అలా చేసి ఉండొచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఈ రకమైన ప్రచారం వెనక అసలు విషయాలు ఏమిటో.