Begin typing your search above and press return to search.

మాటిచ్చారు.. నిల‌బెట్టారు.. ప‌వ‌న్‌పై గిరిపుత్రుల హ‌ర్షం

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై గిరిపుత్రులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

By:  Garuda Media   |   13 May 2026 3:15 PM IST
మాటిచ్చారు.. నిల‌బెట్టారు.. ప‌వ‌న్‌పై గిరిపుత్రుల హ‌ర్షం
X

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై గిరిపుత్రులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. స‌రిగ్గా ఏడాది కిందట ఇచ్చిన హామీని వ‌డివ‌డిగా నెరవేర్చ‌డంపై వారు హ‌ర్షాతి రేకాలు వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మనార్హం. ఉమ్మ‌డి విశాఖ‌ప‌ట్నంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న మ‌న్యం ప్రాంతంలో తాజాగా అధునాత హంగుల‌తో కూడిన ప్ర‌భుత్వ పాఠ‌శాల భ‌వ‌నాన్ని నిర్మించారు. దీనిలో విద్యార్థుల కు అవ‌సర‌మైన అన్ని ఏర్పాట్లు చేశారు.

విద్యార్థినీ విద్యార్థుల‌కు ప్ర‌త్యేకంగా టాయ్‌లెట్ల‌తో పాటు ఆడుకునే మైదానం.. క్రీడాప‌రిక‌రాలు.. గ‌ణితానికి సంబంధించిన ల్యాబులు కూడా ఏర్పాటు చేశారు. అయితే.. సాధార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు గిరిజ‌న ప్రాంతా ల్లో ప‌ర్య‌టించిన నాయ‌కులు హామీలు గుప్పించ‌డ‌మే త‌ప్ప‌... ప‌నిచేసిన వారు చాలా చాలా త‌క్కువ మం ది ఉన్నారు.కానీ, వీరికి భిన్నంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. గ‌త ఏడాది ఏప్రిల్‌లో గిరిజ‌న ప్రాంత‌మైన పెద‌పాడులో పాఠ‌శాల నిర్మాణం చేస్తామ‌ని ఇచ్చిన హామీని కేవ‌లం ఏడాది కాలంలోనే నెర‌వేర్చారు. దీనిపై గిరిజ‌న సంఘాలు.. నాయ‌కులు కూడా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

కేంద్ర‌+గిరిజ‌న నిధుల‌తో..

కేంద్రం కేటాయిస్తున్న సాస్కీ నిధుల‌తోపాటు.. రాష్ట్ర గిరిజ‌న సంక్షేమ శాఖ‌కు కేటాయించే నిధుల‌తో పెద‌పాడులో అధునాతన పాఠ‌శాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనిలో సుమారు 300 మంది విద్యార్థులు చ‌దువుకునేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే.. ప్ర‌స్తుతం 120 మంది విద్యార్థులు మాత్ర‌మే ఉన్నార‌ని అధికారులు తెలిపారు. పాఠ‌శాల‌లోనే మినీ గ్రంథాల‌యాన్ని ఏర్పాటు చేసి.. పుస్త‌కాల‌ను కూడా ప‌వ‌న్ క‌ల్యాణే స‌మ‌కూర్చార‌ని చెప్పారు. ఈ నిర్మాణానికి సుమారు 18 ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చ‌యిన‌ట్టు వెల్ల‌డించారు.

గిరిజ‌నుల‌పై మ‌మ‌కారం..

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌ర‌చుగా గిరిజ‌నుల‌పై మ‌మ‌కారం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఆయ‌న ప‌ర్య‌టించిన ప్రాంతాల్లో విద్యుత్ సౌక‌ర్యం క‌ల్పించారు. కొన్ని ప్రాంతాల్లో గిరిజ‌నుల‌కు పండ్లు పంపించ‌డంతోపాటు వారికి పాద‌ర‌క్ష‌లు కూడా పంపించారు. గిరిజ‌న ప్రాంతాల్లో ర‌హ‌దారుల నిర్మాణం కూడా ప్రాధాన్యంగా తీసుకున్నారు. ఇలా.. ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా.. గిరిజ‌నుల‌పై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌మ‌కారం చూపిస్తున్నారు.