Begin typing your search above and press return to search.

మోడీ సాయం-బాబు విజ‌న్‌-వారి త‌ల రాత మారుస్తాం: ప‌వ‌న్‌

కేంద్రంలోని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌హ‌కారం, ఏపీ సీఎం చంద్ర‌బాబు విజ‌న్‌తో గిరిజ‌నుల త‌ల‌రాత‌లు మార్చే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   13 April 2025 3:32 PM IST
మోడీ సాయం-బాబు విజ‌న్‌-వారి త‌ల రాత మారుస్తాం:  ప‌వ‌న్‌
X

కేంద్రంలోని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌హ‌కారం, ఏపీ సీఎం చంద్ర‌బాబు విజ‌న్‌తో గిరిజ‌నుల త‌ల‌రాత‌లు మార్చే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. `అడ‌విత‌ల్లి బాట‌` కార్య‌క్ర‌మా నికి అన్ని వ‌ర్గాల నుంచి సానుకూల స్పంద‌న రావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. తాను స్వ‌యంగా చేప‌ట్టిన‌ప్ప‌టికీ.. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌దాని న‌రేంద్ర మోడీ, సీఎం చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ఉంద‌ని పేర్కొన్నా రు. వారి స‌హ‌కారంతోనే తాను గిరిజ‌న ప్రాంతాల్లో ప‌ర్య‌టించాన‌ని చెప్పుకొచ్చారు.

రాష్ట్ర చ‌రిత్ర‌లో `అడ‌విత‌ల్లి బాట‌` ఒక అధ్యాయంగా కాద‌ని.. ఒక పుస్త‌కంగా మారుతుంద‌న్నారు. వారి జీవి తాల‌ను స‌మూలంగా మార్చుతుంద‌న్నారు. గిరిజ‌న ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌డం ద్వారా తాను అనేక విష యాలు తెలుసుకున్న‌ట్టు చెప్పారు. గిరిజ‌నులు ఇప్ప‌టికీ అభివృద్దికి దూరంగా ఉంటున్నారని తెలిపారు. చాలా మందికి సెల్ ఫోన్ అంటే ఏమిటో కూడా తెలియ‌కుండా జీవితాలు గ‌డుపుతున్నార‌ని చెప్పారు. ఇక‌, ఏదైనా వైద్య అవ‌స‌రం వ‌స్తే.. డోలీ మోత‌లు త‌ప్ప‌డం లేద‌న్నారు.

వీరి ఆవేద‌న‌, బాధ విన్నాక‌.. వారికి ఏదైనా చేయాల‌ని అనిపించింద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న పీఎం జ‌న్‌మ‌న్‌, పీఎంజీఎస్‌వై, గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కాల నిధుల‌తో గిరిజ‌న గ్రామాల‌ను అభివృద్ధి చేయాల‌ని సంక‌ల్పించిన‌ట్టు తెలిపారు.అదేవిధంగా వెయ్యి కిలో మీట‌ర్ల మేర‌కు ర‌హ‌దారులు నిర్మించాల‌ని సంక‌ల్పించిన‌ట్టు చెప్పారు.

వీటి విలువ సుమారు వెయ్యి కోట్ల వ‌ర‌కు అవుతుంద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ.. మంచి అభిప్రాయం, మంచి ల‌క్ష్యం ఉన్న‌ప్పుడు నిధుల స‌మ‌స్య పెద్ద‌ది కాబోద‌న్నారు. ఆయా ప్రాజెక్టులు అమ‌ల్లోకి వ‌స్తే.. మోడీ చెబుతున్న విక‌సిత భార‌త్‌, చంద్ర‌బాబు ప్ర‌వ‌చిస్తున్న విజ‌న్ 2047 లు సాకారం కావ‌డం పెద్ద క‌ష్టం కాబోద‌ని ఉప ముఖ్య‌మంత్రి వెల్లడించారు.