Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఆలోచ‌న స‌క్సెస్ అయితే.. 50 వేల మందికి ఉద్యోగం!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆలోచ‌న‌లు భిన్నంగా ఉంటాయి. పైకి ఆయ‌న ఏమీ ప్ర‌క‌టించ‌రు. కానీ, చేసి చూపిస్తారు.

By:  Garuda Media   |   24 May 2026 9:43 AM IST
ప‌వ‌న్ ఆలోచ‌న స‌క్సెస్ అయితే.. 50 వేల మందికి ఉద్యోగం!
X

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆలోచ‌న‌లు భిన్నంగా ఉంటాయి. పైకి ఆయ‌న ఏమీ ప్ర‌క‌టించ‌రు. కానీ, చేసి చూపిస్తారు. త‌ను చేసే ప‌నికి పెద్ద‌గా ప్ర‌చారం కూడా కోరుకోరు. కానీ, ఫ‌లితం కావాల‌ని ఆశిస్తారు.ఇలా.. రాష్ట్రంలో ఆయ‌న ఉప ముఖ్య‌మంత్రి అయ్యాక‌.. అనేక కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఫ‌లితాల‌ను కూడా రాబ‌ట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ర‌హ‌దారుల నుంచి వీధి దీపాల వ‌ర‌కు ప్ర‌స్తుతం వెలుగు చిమ్ముతున్నాయి. ఇక‌, గిరిజ‌న ప్రాంతాల్లో ఒక‌ప్పుడు అంధ‌కారంలో మ‌గ్గిన కుటుంబాల‌కు ఇంటింటికీ క‌రెంటు ఇచ్చే ప‌రిస్థితి ఏర్ప‌డింది.

అట‌వీ ఉత్ప‌త్తుల‌కు మార్కెటింగ్ నుంచి ఎర్ర‌చంద‌నానికి భ‌ద్ర‌త వ‌ర‌కు.. అనేక విధాలుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ తీసుకుంటున్న చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాల‌ను ఇస్తున్నాయి. తాజాగా ఆయ‌న ఆలోచ‌న మ‌రింత విస్త‌రించింది. ఇది క‌నుక సక్సెస్ అయితే.. దాదాపు 50వేల మంది యువ‌త‌కు.. ముఖ్యంగా నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు ల‌భిస్తాయి. దీనికి ఆమోదం పొంద‌డం కూడా సులువేన‌ని అధికా రులు చెబుతున్నారు. త‌ద్వారా.. రాష్ట్రంలో ఒక జ‌నరేష‌న్‌కు పెద్ద ఎత్తున ఉద్యోగం ల‌భించ‌డం.. సంచ‌ల‌నంగా మార‌నుందని అంటున్నారు.

ఏంటా ఆలోచ‌న‌..

ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని, ప్ర‌భుత్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లోని ఆల‌యాలు వంద‌లాది ఉన్నాయి. ఇవి కాకుండా ప్రైవేటు ఆల‌యాలు కూడా ఉన్నాయి. ఆయా ఆల‌యాల‌కు భారీ సంఖ్య‌లో భ‌క్తులు పెరుగుతున్నారు. ఒక‌ప్పుడు ప‌ర్వ‌దినాల స‌మ‌యంంలోనే ఎక్కువ మంది భ‌క్తులు వ‌చ్చేవారు. కానీ, ఇప్పుడు సంద‌ర్భంతో ప‌నిలేకుండా భ‌క్తులు పోటెత్తుతున్నారు. ఈ క్ర‌మంలో వారికి భద్ర‌త క‌ల్పించ‌డం.. స‌ర్కారుకు ఇబ్బందిక‌రంగా మారుతోంది. ఎందుకంటే.. భ‌ద్ర‌త‌కు.. ఇటు సొసైటీలో అయినా.. అటు ఆల‌యాల వ‌ద్దైనా.. సివిల్ పోలీసుల‌నే నియ‌మించాల్సి ఉంటుంది.

కానీ రాష్ట్రంలో సాధార‌ణ విధుల‌కే సివిల్ పోలీసుల సంఖ్య స‌రిపోయేలా క‌నిపించ‌డం లేదు. దీంతో కేసులు పెండింగులో ప‌డుతు న్నాయి. ఈ నేప‌థ్యంలో ఆల‌యాల‌కు ప్ర‌త్యేకంగా భ‌ద్ర‌తా సిబ్బందిని నియ‌మించాల‌ని.. అది కూడా ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోనే ఉండాల‌న్న‌ది ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆలోచ‌న‌.దీనికి సంబంధించి ఆయ‌న పెద్ద ప్ర‌ణాళిక‌పైనే క‌స‌ర‌త్తు చేశారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి కొత్త ప్రదేశాలు చూసేందుకు రాష్ట్రానికి వచ్చే వారికి పూర్తి భద్రత కల్పించేందుకు ‘పర్యాటక పోలీసు’ విధానంపై ఆయ‌న క‌స‌ర‌త్తు చేశారు.

అయితే.. దీనికి సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని మంత్రి వ‌ర్గం ఓకే చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా నియ‌మ‌నిబంధ‌న‌లు కూడా రూపొందించాలి. ఇది క‌నుక పూర్త‌యితే.. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మంది ప‌ర్యాట‌క పోలీసులు అందుబాటులోకి వ‌స్తారు. త‌ద్వారా.. యువ‌త‌కు ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి. అలానే ప‌ర్యాట‌క ప్రాంతాల్లో భ‌ద్ర‌త‌తోపాటు.. ఆల‌యాలకు కూడాభ‌ద్ర‌త మ‌రింత‌, పార‌ద‌ర్శ‌కత ల‌భిస్తాయ‌ని ప‌వ‌న్ ఆలోచ‌న‌గా ఉంది.