Begin typing your search above and press return to search.

పవన్ రాజకీయ వ్యూహాలు వైసీపీకి అర్థం కావడం లేదా ?

ఇలా పవన్ ప్రతీ సభలో మేమే మళ్ళీ వస్తాం, ఏపీలో అభివృద్ధి జరుగుతోంది, పాలన గాడిన పడింది అని చెబుతున్నది అంతా జనాలకు సందేశం ఇచ్చేందుకే అంటున్నారు.

By:  Tupaki Desk   |   5 July 2025 7:00 AM IST
పవన్ రాజకీయ వ్యూహాలు వైసీపీకి అర్థం కావడం లేదా ?
X

వైసీపీది పదిహేనేళ్ల రాజకీయ అనుభవం. అందులో ఉన్న వారు సీనియర్ నేతలు కూడా. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాలు వ్యాఖ్యలు మాత్రం వైసీపీ అర్థం చేసుకోలేకపోతోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో జరిగిన సభలో పవన్ కూటమి మరో పదిహేనేళ్ల పాటు కొనసాగితీరుతుందని గట్టిగా చెప్పాలి. దాని అవసరం ఏమిటో కూడా చెప్పారు.

ఆయన కూటమిలోని పార్టీలకు చెబుతూనే జనాలకు కూడా చెప్పాల్సింది చెబుతున్నారు ఏపీ గాడిలో పడాలి అంటే అనుభవం విశేషంగా ఉన్న చంద్రబాబు నాయకత్వం అవసరం అన్నారు. బాబు కాబట్టి ఏపీ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెడుతున్నారు అని పవన్ పేర్కొనడం విశేషం. ఇక తన గురించి చెబుతూ తనకు పోరాడే తత్వం ఉందని చెప్పుకున్నారు.

తాను ఎందాకైనా అని పోరాడగలను అని ఆయన చెప్పారు. అయితే తనకు పాలనానుభవం లేదని అందుకే బాబు సీఎం గా ఉండాలని అన్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో కూటమితో జత కట్టడం వల్లనే పెద్ద ఎత్తున సహకారం లభిస్తోందని వివరించారు. ఇలా అందరూ కలిస్తేనే ఏపీలో అభివృద్ధి సాగుతోందని అన్నారు.

ఈ విషయంలో ఒకరు ఎక్కువ అని ఒకరు తక్కువ అని లేదని పవన్ క్లారిటీ ఇచ్చారు. అంతా కలసి ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. దీనిని బట్టి ఆయన 2029లో కూడా కూటమిగానే తాము అంతా కలసి వస్తామని చెప్పాల్సింది చెప్పేశారు. మీరు అధికారంలోకి ఎలా వస్తారు అని వైసీపీ మీద ఆయన ఎదురు దాడి చేశారు. ఎట్టి పరిస్థితిలలో వైసీపీని అధికారంలోకి రానీయమని పవన్ మరోసారి స్పష్టం చేయడం విశేషం.

ఏపీకి కూటమి ప్రభుత్వం పాలన అవసరం అని ఆయన అంటున్నారు. అయితే పవన్ ఈ ప్రకటనల వెనక బహుముఖ వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. మొదటిది చూస్తే కూటమిలోని పార్టీలు మరింత ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడం. ఇక పై స్థాయిలో ఆ ఐక్యత ఉన్నా గ్రౌండ్ లెవెల్ లో లుకలుకలు ఉన్నాయి. అందువల్ల అంతా సర్దుకుని ఒకే మాట మీద నిలబడాలని పవన్ గట్టిగా కోరుకుంటున్నారు అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే వైసీపీకి ఇది గట్టి హెచ్చరికగా ఉందని అంటున్నారు. కూటమి పార్టీలు చీలితే 2019 ఎన్నికల్లో మాదిరిగా తాము లబ్ది పొందుతామని వైసీపీ భావిస్తోంది కానీ అలాంటిది ఏదీ జరగదని మరో మూడు ఎన్నికల వరకూ కూటమే అధికారంలో ఉంటుందని వైసీపీది అత్యాశ అని చెప్పడమే పవన్ వ్యాఖ్యల వెనక ఉన్న వ్యూహమని అంటున్నారు.

అంతే కాదు జనాలకు కూడా ఆయన మెల్లగా మెసేజ్ పంపిస్తున్నారు. ఏపీ బాగుపడాలీ అంటే కూటమికే మరిన్ని చాన్సులు అధికారం ఇవ్వాలన్నది పవన్ పిలుపుగా ఉందని చెబుతున్నారు. అభివృద్ధి మధ్యలో ఆగిపోరాదని ఏపీ విభజన గాయాలతో పాటు వైసీపీ అద్యిదేళ్ళ పాలనలో తీవ్రంగా దెబ్బ తిని ఉందని అందువల్ల ప్రస్తుతం అయిదేళ్లలో అన్నీ జరగవని ఏపీ ఒక షేపునకూ రూపునకూ రావాలీ అంటే జనాలు అనుభవం ఉన్న చంద్రబాబుని అలాగే పోరాట పటిమ ఉన్న తనను సహకారం అందించే బీజేపీని దీవించాలని కోరుతున్నారు.

ఇలా పవన్ ప్రతీ సభలో మేమే మళ్ళీ వస్తాం, ఏపీలో అభివృద్ధి జరుగుతోంది, పాలన గాడిన పడింది అని చెబుతున్నది అంతా జనాలకు సందేశం ఇచ్చేందుకే అంటున్నారు. అయితే వైసీపీ మాత్రం ఈ విషయంలో పవన్ ని విమర్శించేందుకే చూస్తోంది. వైసీపీని రానీయం అనే కంటే బాబు పల్లకీ మోస్తాను అని పవన్ చెప్పుకోవడం బెటర్ అని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు అంటున్నారు.

ఏపీలో పాలన ఏమి బాగుందో పవన్ చెప్పాలని కూడా నిలదీస్తున్నారు. మీరంతా కలసి వచ్చినా జనాలు ఓడిస్తారు అని ఆయన చెబుతున్నారు. అయితే పవన్ చెబుతున్న దాంట్లో అభివృద్ధి కోణం జనానికి కనెక్ట్ అయ్యేలా ఉంది. మరి అలాంటి అభివృద్ధి అజెండాతో వైసీపీ కూడా వచ్చి మేము కూడా డెవలప్మెంట్ ని కంటిన్యూ చేస్తామని కొత్తగా మరిన్ని ప్రాజెక్టులు టేకప్ చేస్తామని చెప్పాల్సి ఉందని అంటున్నారు.

అలా జనాలను కన్వీన్స్ చేయకుండా పవన్ మీద విమర్శలు చేస్తే ఉత్త రాజకీయ ప్రకటనలుగానే మిగిలిపోతాయని అంటున్నారు. అంతే కాదు, అటు చంద్రబాబు చెప్పినా పవన్ చెప్పినా ఏపీ గాడిన పడింది అని అంటున్నారు. మరి అయిదేళ్ళలో మేము చేసిన అభివృద్ధి ఇది అని జగన్ కానీ వైసీపీ నేతలు కానీ ఇప్పటికీ పెట్టుకోకపోవడం కూడా ఆ పార్టీకి ఒక లోటుగా చెబుతున్నారు.