Begin typing your search above and press return to search.

సినీ నటి వాసుకి (పాకీజా)కి పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం!

ఈ క్రమంలో.. తమిళ ఇండస్ట్రీలో ఎవరూ ఆదుకోకపోవడంతో.. సాయం కోసం ఏపీకి వచ్చారు. ఈ సమయంలో ఆమెను పవన్ కల్యాణ్ ఆదుకున్నారు!

By:  Tupaki Desk   |   1 July 2025 3:50 PM IST
సినీ నటి వాసుకి (పాకీజా)కి పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం!
X

ఒకానొక సమయంలో వాసుకి (పాకీజా) పాత్ర లేకుండా తెలుగు సినిమాలు విడుదల కాలేదని చెప్పినా అతిశయోక్తి కాదేమో. వెండితెరపై ఎందరినో నవ్వించిన ఆమె.. ప్రస్తుతం పూట గడవడం కోసం భిక్షాటన చేసే దుస్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో.. తమిళ ఇండస్ట్రీలో ఎవరూ ఆదుకోకపోవడంతో.. సాయం కోసం ఏపీకి వచ్చారు. ఈ సమయంలో ఆమెను పవన్ కల్యాణ్ ఆదుకున్నారు!


అవును... తన దృష్టికి వచ్చిన ఎన్నో సమస్యలపై స్పందిస్తూ, వ్యక్తిగతంగా ఎంతోమంది సహాయం చేసే విషయంలో ముందుండే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్... తీవ్ర తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి వాసుకి (పాకీజా)కి ఆప్త హస్తం అందించారు. ఇందులో భాగంగా.. ఆమె దీన స్థితి తెలిసి చలించిన పవన్ కళ్యాణ్.. రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.


ఈ నేపథ్యంలో... మంగళవారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా స్పందించిన పాకీజా... పవన్ కళ్యాణ్ చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.


ఇదే సమయంలో.. ఆయన చిన్నవాడైనప్పటికీ ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఆర్థిక పరిస్థితి గురించి నిన్ననే పవన్ కళ్యాణ్ కార్యాలయానికి తెలియజేశాననీ, తక్షణం స్పందించి తగిన విధంగా ఆర్థిక సాయం అందించారని తెలిపారు. పవన్ కళ్యాణ్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.