Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఇమేజ్: క‌నిపించ‌ని క‌ద‌లిక‌..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇమేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

By:  Tupaki Desk   |   24 April 2025 2:04 PM IST
ప‌వ‌న్ ఇమేజ్: క‌నిపించ‌ని క‌ద‌లిక‌..!
X

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇమేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న సిని మా గ్లామ‌ర్‌తో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. తొలినాళ్ల‌లో అలానే రాజ‌కీయాలు చేశారు. అయితే.. కొన్నాళ్లు ఈ గ్లామ‌ర్ పెద్ద‌గా ప‌నికిరాలేదు. అందుకే 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు ఆశించిన మేర‌కు ఫ‌లితం రాలేదు. కానీ, 2024కు వ‌చ్చేస రికి.. ప‌వ‌న్‌లో ఉన్న రాజ‌కీయ నేత బ‌య‌టకు వ‌చ్చారు. ఇది.. క‌నిపించ‌ని క‌ద‌లిక‌ను తీసుకువ‌చ్చింది.

కౌలు రైతుల‌కు సాయం చేయ‌డంతోపాటు.. ర‌హ‌దారుల దుస్తితిపై ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వైసీపీ హ‌యాంలో జో రుగానే స్పందించారు. ఈ రెండు కూడా మంచి ఫ‌లితాలుఇచ్చాయి. అదేస‌మ‌యంలో స‌మ‌కాలీన స‌మ‌స్య ల‌పై ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు రియాక్ట్ అయ్యారు. ఇది కూడా మంచి ఫ‌లితాన్నే అందించింది. మొత్తానికి ప‌వ‌న్‌లో ఉన్న రాజ‌కీయ నేత‌ను బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చింది. దీనిని ప్ర‌జ‌లు కూడా యాక్స‌ప్ట్ చేశారు. ఇదే 2024 ఎన్నిక‌ల్లో వంద శాతం ఫ‌లితాన్నిరాబ‌ట్టింది.

అయితే.. ప‌వ‌న్ ఇమేజ్‌.. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంద‌న్న వాద‌న‌ను ఇక్క‌డ తోసిపుచ్చ డానికి వీల్లేదు. ఎందుకంటే.. స‌మ‌యాభావం కావొచ్చు.. లేదా.. రాజ‌కీయంగా ఇంకా పుంజుకోలేద‌న్న ఉద్దేశం కావొచ్చు.. మొత్తానికి గ్రామీణ రాజ‌కీయంపై అయితే.. ప‌వ‌న్ ఏడాది కిందటి వ‌రకు ప‌ట్టు బిగించ‌లేక పోయారు. దీనిని గ‌మ‌నించిన వైసీపీ గ్రామీణ స్థాయిలో త‌మ‌కు ఉన్న ప‌ట్టును క‌దిలించే శ‌క్తి ప‌వ‌న్‌కు లేద‌ని పేర్కొన‌డం ప్రారంభించింది.

ఇది ఒక‌రకంగా జ‌న‌సేన‌కు హెచ్చరిక లాంటిద‌ని భావించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. గ్రామీణంపై దృష్టి పెట్టారు. ఇప్పుడు వైసీపీ చెబుతున్న గ్రామీణ రాజ‌కీయాల‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ పూర్తి ప‌ట్టు ద‌క్కించుకున్నారు. ర‌హ‌దారుల నిర్మాణం నుంచి మౌలిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న వ‌ర‌కు.. ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుని ఏర్పాటు చేస్తున్నారు. ఇక‌, పంచాయ‌తీల‌కు నిధులు ఇవ్వ‌డంలోనూ.. ప‌నులు ముందుకు సాగేలా చేయ‌డంలోనూ ప‌వ‌న్ పేరు మార్మోగుతోంది. సో.. ప‌వ‌న్ ఇమేజ్ ఇప్పుడు గ్రామీణ స్థాయిలో క‌నిపించ‌ని క‌ద‌లిక‌ను తీసుకువ‌చ్చింది.