మరిన్ని దాడులకు అవకాశం ఉంది.. : పవన్ కల్యాణ్
ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన అనంతపురం జిల్లాకు చెందిన అగ్నివీర్ మురళీ నాయక్ అం త్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన పవన్ కల్యాణ్.
By: Tupaki Desk | 11 May 2025 2:15 PM ISTకాల్పుల విరమణ ఒప్పందానికి తానే ముందుకు వచ్చి.. అనంతరం 3-4 గంటల్లోనే ఒప్పందాన్ని (అవగా హన మాత్రమే కుదిరినట్టు కేంద్రం తెలిపింది) తుంగలో తొక్కిన పాకిస్థాన్‌ను ఎవరూ నమ్మొద్దని ఏపీ డి ప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ నక్కజిత్తులు అందరికీ తెలిసినవేనన్న ఆయన.. కాళ్ల బేరానికి వచ్చినట్టే వచ్చి.. మళ్లీ తన వక్ర బుద్ధిని ప్రదర్శించిందని దుయ్యబట్టారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో... మనం దేశానికి, సైన్యానికి అండగా ఉండాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ''పాకిస్తాన్ కాల్పుల విరమణను ఎవరూ నమ్మడంలేదు. పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చిన మూడు గంటల్లోనే మళ్ళీ కాల్పులకు తెగబడ్డారు.! రాబోయే రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటివి ఎప్పుడైనా మరిన్ని దాడులకు తెగబడే ప్రమాదం ఉంది. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి.'' అని డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యానించారు.
ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన అనంతపురం జిల్లాకు చెందిన అగ్నివీర్ మురళీ నాయక్ అం త్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన పవన్ కల్యాణ్.. ఆ కుటుంబాన్ని ఓదార్చారు. మురళీ నాయక్ కు నివా ళులర్పించారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్థాన్ పరిస్థితి కాళ్లబేరానికి వచ్చిందన్నారు. అయితే.. దానిని నమ్మడానికి వీల్లేదని చెప్పారు.
ఇలాంటి విపత్కర సమయంలో భారతీయులు ఏకతాటిపై నడవాల్సిన అవసరం ఉందన్న పవన్ కల్యా ణ్.. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని.. సంపూర్ణంగా సహకరిస్తా మని చెప్పారు. మురళీ నాయక్ కుటుంబానికి రూ.50 లక్షలు ప్రభుత్వం తరఫున, 25 లక్షలు వ్యక్తిగతంగా కూడా సాయం చేస్తున్నట్టు చెప్పారు. మురళీ నాయక్ విగ్రహాన్ని అనంతపురంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
