Begin typing your search above and press return to search.

ఎంత సేపూ రంకులు బొంకులు తప్ప..... పవన్ మార్క్ సూపర్ సెటైర్లు !

ఆయన ఏది మాట్లాడినా సగటు జీవి మనో భావాలే ప్రతిబింబిస్తాయి. ఆయన పేరుకు సెలిబ్రిటీ కావచ్చు కానీ ఆయన ఆలోచనలు ఎపుడూ సగటు మనిషికి కనెక్ట్ అవుతూనే ఉంటాయి.

By:  Satya P   |   27 May 2026 12:20 PM IST
ఎంత సేపూ రంకులు బొంకులు తప్ప..... పవన్ మార్క్ సూపర్ సెటైర్లు !
X

టీవీ చానళ్ళు లేదా యూ ట్యూబ్ చానళ్ళు, అలాగే ఇతర డిజిటల్ మాధ్యమాలు ఇవన్నీ కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. ఇది మంచి పరిణామంగానే అంతా చూస్తున్నారు. ఎందుకంటే ఎంత పెద్ద ఎత్తున ప్రసార సాధనాలు ఉంటే అంతలా గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలుస్తాయని, జనం ఇబ్బందులు సమస్యలు కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ మరింతగా ప్రొజెక్ట్ అవుతాయని అంతా భావిస్తారు. కానీ జరుగుతున్నది వేరేగా ఉంది అన్నది అందరి మాట. ఎంతసేపూ సెలిబ్రిటీల గురించి వారి జీవితాల గురించి లోతైన అన్వేషణ చేస్తూ పోవడమే తప్ప ఇతర అంశాలే పట్టనట్లుగా కొన్ని మీడియా సంస్థలు పోతున్న పోకడల పట్ల పౌర సమాజంలోనూ ఆవేదన ఉంది, ఆగ్రహం ఉంది, ఆక్రోశమూ ఉంది.

కనెక్ట్ అవుతున్నాయి :

దీని మీదనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆయన ఏది మాట్లాడినా సగటు జీవి మనో భావాలే ప్రతిబింబిస్తాయి. ఆయన పేరుకు సెలిబ్రిటీ కావచ్చు కానీ ఆయన ఆలోచనలు ఎపుడూ సగటు మనిషికి కనెక్ట్ అవుతూనే ఉంటాయి. ఇపుడు కూడా పవన్ కళ్యాణ్ కొన్ని ప్రసార మాధ్యమాల తీరు మీద గట్టిగానే మాట్లాడారు. ఉన్న విషయం ఉన్నది ఉన్నట్లుగా వివరించారు. దాంతో ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నిజమే కదా పవన్ చెప్పింది అని అంతా అంటున్నారు. మన మనసులో ఉన్నదే పవన్ చెప్పారు కదా అని కూడా అంటున్నారు.

ఇంతకీ ఏమన్నారంటే :

ఇక పవన్ కళ్యాణ్ మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడరు అన్నది అందరికీ తెలిసిందే. ఆయన ఉన్న విషయం కుండ బద్దలు కొడతారు. అవతల వారు ఏమనుకున్నా ఆయన గట్టిగానే చెబుతారు. ఇపుడు కూడా అలాగే పవన్ సీరియస్ కామెంట్స్ చేశారు. కొన్ని టీవీ చానళ్ల వైఖరి పట్ల ఆవేదనతో కూడిన పవన్ కామెంట్స్ అందరికీ ఆలోచింపచేస్తున్నాయి. ఈ టీవీ చానళ్ళు ప్రజా సమస్యల గురించి ఎపుడైనా మాట్లాడారా అని నిలదీశారు. గోదావరి నది వంటి కలుషితం అవుతున్న నీటి సమస్యల మీద మాట్లాడారా అని ప్రశ్నించారు. ఎంత సేపూ రంకులు బొంకులు తప్ప ఏమి మాట్లాడుతున్నారు, ఏమి చూపిస్తున్నారు అని పవన్ గట్టిగానే అడిగారు.

పేపర్ మీడియా కాలంలో :

ఇక పవన్ గతంలో పేపర్ మీడియా కాలంలో కొన్ని స్పెషల్ పేజీలలో గాసిప్స్ ని రాసేవారు అని చెప్పుకొచ్చారు. ఆ రోజులలో అవి ఆ మాత్రానికే పరిమితం అని కానీ ఇపుడు విస్తరించిన టెక్నాలజీలో మీడియా బలంగా ఉన్న కాలంలో కూడా ఇంకా ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా ఇంకా అవే చూపించాలను కోవడమేంటని నిలదీశారు. ప్రజలకు విజ్ఞానం కలిగించే విషయాల గురించి చెబుతున్నారా అని ప్రశ్నించారు. ఎన్నో సమస్యలు ఉన్నాయని కానీ వేటి గురించి ప్రస్తావించకుండా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఏదో వస్తుందని చేస్తున్నారు తప్ప్పించి చిత్త శుద్ధి ఉందా అని పవన్ నిగ్గదీశారు. పవన్ చేసిన ఈ కామెంట్స్ అయితే ఇపుడు జనంలో చర్చకు తావిస్తున్నాయి. నిజంగా ఎన్నో సమస్యలు దేశంలో ఉన్నాయి. వాటి గురించి చర్చించి పరిష్కారలను ఆలోచించవచ్చు కదా అని మేధావుల నుంచి అంతా కోరుకుంటున్నారు. కానీ జరుగుతున్నది వేరుగా ఉందని అంటున్నారు. అందుకే పవన్ కూడా గట్టిగానే ఇచ్చారని అంటున్నారు.