పవన్ కార్నర్ అవుతున్నారా...ఎందుకలా ?
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఇటీవల కాలంలో అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి.
By: Satya P | 9 July 2026 1:32 PM ISTజనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఇటీవల కాలంలో అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. అందులో కొన్ని తెచ్చి పెట్టుకున్నవి అయితే మరికొన్ని అనవసరంగా తగులుకున్నవి. విజయవాడ క్రిష్ణ లంకలోని గాదె సాయి క్రిష్ణ కేసు అయితే జనసేనకు కోరి చుట్టబడింది అని అంటున్నారు. ఈ కేసులో నిజానికి జనసేనకు ఎలాంటి సంబంధం లేదు. ఎందరో పార్టీ కార్యకర్తలు ఉంటారు, ఎవరేమిటి చేస్తున్నారు అన్నది పార్టీకి పట్టింపు ఉంటుందా అన్నది ఒక ప్రశ్న. అంతే కాదు ఎవరు ఎలాంటి వారు అన్నది కూడా తెలియదు, తెలిసిన తరువాత దూరం పెడతారు. సాయి క్రిష్ణ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన వాడు అని జనసేన దూరం పెట్టింది. అయితే అంతవరకూ ఓకే కానీ ఆయన విషయంలో విపక్షాలు కానీ సోషల్ మీడియా కానీ జనసేనని టార్గెట్ చేసింది. దాంతో పవన్ ఓపెన్ అయిపోయారు. పార్టీ మీటింగులో మాట్లాడుతూ క్రిమినల్స్ కి కులాలు ఏమిటి అన్నారు. ఈ విధంగా పవన్ విపక్షాల ట్రాప్ లోకి చిక్కుకున్నారు అని అంటున్నారు. ఈ విషయంలో పార్టీగా ఆయన సైలెంట్ గా ఉంటే సరిపోయేదని సూచనలు కూడా వచ్చాయి.
యూట్యూబర్ విషయంలోనూ :
ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎంత పెద్ద అవకాశమో అంతకు మించి పెను శాపంగా మారింది. ముఖ్యంగా సెలిబ్రిటీలకు ఈ ఇబ్బంది తప్పడం లేదు, ఎన్ని రకాల చట్టాలు వచ్చినా మరేమి చేసినా కోట్లలో ఉన్న జనాలను ఈ విషయంలో కట్టడి చేయడం కష్టమే అవుతోంది. వారు ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వారిని అయినా ఎంచుకుని మరీ విమర్శలు చేస్తున్నారు. ఆ విధంగా చేస్తే తాను పెద్ద వారు కావచ్చు అన్నది వారి ఆలోచన. అందుకే ఇలాంటి వాటి విషయంలో తక్కువగానే రియాక్ట్ కావడమే మేలు అన్న భావన ఉంది. ఇక ఒక మీటింగులో యూట్యూబర్ పవన్ మీద తీవ్ర విమర్శలు చేశారు. దానితో ఆయనను తీసుకుని వచ్చి కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఆ మీదట కోర్టు బెయిల్ ఇచ్చింది. అక్కడితే ఈ ఇష్యూ వదిలేస్తే పోయేది ఉపా లాంటి చట్టలను ప్రయోగించే దాకా వెళ్ళడం అంటే మరింతగా సమస్యను పెంచుకోవడమే అని అంటున్నారు.
వారిని కట్టడి చేయాల్సిందే :
మరో వైపు చూస్తే యూట్యూబర్ ని తెచ్చిన ప్రతీ పోలీస్ స్టేషన్ వద్ద జనసైనికులు ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తూ ఆందోళనను నిర్వహించడం పోలీస్ స్టేషన్ గోడలు దూకేందుకు ప్రయత్నం చేయడం ఇవన్నీ పార్టీకి చికాకుగానే మారుతున్నాయని అంటున్నారు. ఒక ఇష్యూ మీద ప్రభుత్వం సీరియస్ గా ఉంటే మధ్యలో పార్టీ క్యాడర్ కి ఏమి పని అన్నది కూడా చర్చగా ముందుకు వస్తోంది. ఇలాంటి దుందుడుకు చర్యల మూలంగా పార్టీకే ఇబ్బంది అవుతుందని అంటున్నారు. అంతే కాదు దారిన పోయే బురదను తెచ్చి మీదకు వేసుకున్నట్లు అవుతోంది అంటున్నారు.
వీటి విషయం మరచారా :
ఏపీలో ఇపుడు సర్ పేరుతో ప్రక్రియ సాగుతోంది. టీడీపీ వైసీపీ నేతలు దాని మీద ఫోకస్ పెట్టి ఉన్నారు. తమ సానుభూతిపరుల ఓట్లు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత జనసేనకు ఉంది కదా అంటున్నారు. కార్యకర్తలు ఈ విధంగా వీధులలో వీరంగం వేయడం కంటే స్థానిక ఎన్నికల మీద ద్ర్ష్టి పెట్టడం అలాగే సర్ విషయంలో ఓట్లు పోకుండా చూసుకోవడం వంటివి చేస్తే పార్టీ పటిష్టం అవుతుందని అంటున్నారు. ఇక ఏపీలో జనసేన బలమైన మూడవ పార్టీగా ఎమెర్జ్ అవుతోంది. ఈ క్రమంలో పార్టీ మీద విమర్శలు వస్తూంటాయి. అందులో వేటికి విలువ ఇవ్వాలి వేటిని వదిలేయాలి అన్నది ఆచీ తూచీ తేల్చుకోకపోతే విపక్షాల ట్రాప్ లోనే పడతారు అని అంటున్నారు.
