Begin typing your search above and press return to search.

పవన్ లోని అసలైన ఫైర్ ని చూశారు !

పార్టీ నేతల తీరు మీద సీరియస్ గా ఉన్న పవన్ సమావేశం మొదటి నుంచే తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. నేతల తీరు మార్చుకోవాలని సూచించారు.

By:  Satya P   |   3 Feb 2026 6:00 AM IST
పవన్ లోని అసలైన ఫైర్ ని చూశారు !
X

తిరుపతి లడ్డూ ఇష్యూ ఇపుడు ఏపీని పూర్తిగా కుదిపేస్తోంది. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అని రెండేళ్ళ క్రితం కూటమి పెద్దలు చెప్పారు. దానికి ప్రాయశ్చిత్తంగా పవన్ దుర్గమ్మ గుడి మెట్లను ప్రక్షాళన చేశారు. అదే విధంగా ఆయన ప్రాయశ్చిత్త దీక్షను తీసుకుని కాలి నడకన తిరుమల కొండెక్కి మరీ స్వామి వారిని దర్శించారు. అదే తిరుపతిలో ఒక సభను పెట్టి సనాతన ధర్మం గురించి గట్టిగా చాటారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఒకటి దేశంలో ఉండాలని కొత్త డిమాండ్ ని కూడా చేశారు.

కట్ చేస్తే లేటెస్ట్ గా :

ఇక ఇరవై నెలల తరువాత చూస్తే మరోసారి తిరుపతి లడ్డూ ఇష్యూ ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. దానికి కారణం సీబీఐ తన నివేదికలో జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పడం, నెయ్యిలో కల్తీ జరిగింది అని తేల్చడం. దీంతో ఈ ఇష్యూ మీద వైసీపీ వర్సెస్ కూటమిగా కొత్త వార్ స్టార్ట్ అయిపోయింది. సోషల్ మీడియా వేదికగా సాగుతూ వచ్చిన ఈ వ్యవహారం కాస్తా ఇపుడు రోడ్డున పడింది. అది కాస్తా మాజీ మంత్రి అంబటి రమబాబు అరెస్ట్ దాకా వెళ్ళింది. ఇలా ఏపీ హీటెక్కిపోతూంటే టీడీపీ నేతలు వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని గట్టిగా తిప్పికొడుతున్నారు. అదే సమయంలో జనసేన నుంచి అయితే పెద్దగా వాయిస్ బయటకు రావడం లేదు, ఈ నేపథ్యంలో మంగళగిరిలో పవన్ కళ్యాణ్ జనసేన జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి పార్టీ నేతల తీరు మీద ఫుల్ సీరియస్ అయ్యారని ప్రచారం సాగుతోంది.

ఎందుకీ మౌనం అంటూ :

వైసీపీ నేతలు ఒక వైపు తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే జనసేన నేతలు మౌనం దాల్చడం ఏమిటి అని పవన్ సీరియస్ అయ్యారు. గట్టిగా తిప్పికొట్టాలి కదా అని పార్టీ నేతలకు క్లాస్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అన్నీ తానే మాట్లాడాలి అనుకుంటే ఎలా అని ఆయన ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, సీనియర్ నేతలు ఇలా కీలక బాధ్యతలతో ఉన్న వారు ఎవరూ కూడా ఇంతటి సీరియస్ ఇష్యూలో పెదవి విప్పకపోవకపోవడమేంటి అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు అని అంటున్నారు. పవన్ లో ఇంత ఫైర్ ఎపుడూ చూడని పార్టీ నేతలు షాక్ తిన్నారని అంటున్నారు.

సహించేది లేదంటూ :

ఇదే సమావేశంలో రైల్వే కోడూరుకు చెందీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం కూడా చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఉండాలని వ్యక్తిగత వ్యవహారాలు తెచ్చి పార్టీకి నష్టం కలిగిస్తే సహించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. పార్టీలో యాక్టివ్ గా ఉండాలని కోరారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎపిసోడ్ మీద కూడా సమావేశంలో పవన్ చర్చించారు అని అంటున్నారు

వైసీపీ ట్రాప్ లో పడొద్దు :

ఏ ఇష్యూ మీద అయినా సబ్జెక్ట్ తో ఫుల్ క్లారిటీతో మాట్లాడాలని అంతే తప్ప వైసీపీ నేతలు రెచ్చగొడితే రెచ్చిపోవద్దని వారి ట్రాప్ లో అసలు పడవద్దని పార్టీ నేతలకు పవన్ సూచించారు అని అంటున్నారు. సిద్ధాంత పరంగానే మాట్లాడాలని ఆయన కోరారు.

మధ్యలో నుంచే బయటకు :

పార్టీ నేతల తీరు మీద సీరియస్ గా ఉన్న పవన్ సమావేశం మొదటి నుంచే తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. నేతల తీరు మార్చుకోవాలని సూచించారు.అంతే కాకుండా ఎవరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఎవరేమి చేస్తున్నారు అన్న దాని మీద తనకు పూర్తి నివేదిక ఇవ్వాలని ఆయన మంత్రి నాదెండ్ల మనోహర్ కి సూచించి సమావేశం సాగుతూండగానే మధ్యలోనే అక్కడ నుంచి వెళ్ళిపోయారని అంటున్నారు. దీంతో పార్టీ మీటింగ్ నుంచి పవన్ బయటకు వెళ్ళారు అన్నది మరో హాట్ టాపిక్ గా ఉందని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ సొంత పార్టీ నేతల తీరు మీద అయితే పూర్తిగా గుస్సా అయ్యారని అంటున్నారు.