Begin typing your search above and press return to search.

మోడీ..అమిత్ షాలతో పవన్ భేటీ...?

ఢిల్లీకి వెళ్ళిన పవన్ మరో రోజు కూడా అక్కడే ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   18 July 2023 1:37 PM GMT
మోడీ..అమిత్ షాలతో పవన్ భేటీ...?
X

ఢిల్లీకి వెళ్ళిన పవన్ మరో రోజు కూడా అక్కడే ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. పవన్ని కోరి మరీ కేంద్ర పెద్దలు ఆహ్వానించారు. దానికి స్పందించిన పవన్ ఇది ఎన్నాళ్ళో వేచి చూసిన అవకాశం అన్నారు. తాను చెప్పాల్సినవి అన్నీ కేంద్ర బీజేపీ పెద్దలకు చెబుతాను అని ఢిల్లీలో అడుగు పెట్టినపుడే మీడియా ముందు చెప్పుకొచ్చారు.

ఇక రెండవ రోజు అయితే తన మనసులో మాటలను ఆయన మీడియా ముందు కుండబద్ధలు కొట్టినట్లుగా చెప్పేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం గద్దె దిగాల్సిందే అని గద్దించారు. అదే టైం లో బీజేపీ టీడీపీ జనసేన కలసి పోటీ చేస్తాయని కూడా చెప్పేశారు. 2014 పొత్తులు రిపీట్ అవుతాయని ఆయన స్పష్టం చేశారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం మీద ఢిల్లీలోనే ఆయన నిప్పులు చెరిగారు. తనకు ఏపీ చాలా ముఖ్యం అన్నారు. ఈ విషయంలో తాను వైసీపీ వ్యతిరేక ఓటుని ఒక్కదాన్ని కూడా పోనీయను అన్నారు. ఇదిలా ఉంటే పవన్ వద్ద కీలక నివేదిక ఉందని అంటున్నారు.

ఆ నివేదికలో ఏపీలో వైసీపీ నాలుగేళ్ళ పాలనలో చేసిన అరాచకాలు అన్యాయలు అవినీతీ అంతా ఉందని అంటున్నారు. దానికి సంబంధించిన కీలక అంశాలను ఎండీయే సమావేశంలో ప్రధాని అమిత్ షా సమక్షంలోనే చదివి వినిపిస్తారు అని అంటున్నారు. అలాగే ఆ మీటింగ్ కి హాజరయ్యే పార్టీలకు కూడా ఏపీలోని పరిస్థితిని కళ్లకు కట్టినట్లుగా వివరిస్తారని అంటున్నారు.

మరో వైపు ఎండీయే మీటింగ్ తోనే పవన్ ఢిల్లీ నుంచి రారు అని తెలుస్తోంది. ఆయన మరో రోజు ఢిల్లీలో ఉండి అయినా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లతో పాటు బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డతో ముఖా ముఖీ సమావేశాన్ని జరుపుతారు అని అంటున్నరు.

ఈ మేరకు పవన్ బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోరారని తెలుస్తోంది. మరి పవన్ కి ఢిల్లీ పెద్దలు అపాయింట్మెంట్ ఇచ్చినట్లు అయితే పవన్ ఏపీకి సంబంధించి తన రోడ్ మ్యాప్ ఏంటి అన్నది వారికి వివరిస్తారని ఎట్టి పరిస్థితిల్లోనూ వైసీపీ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలనివ్వకూడదని కేంద్ర పెద్దలకు చెబుతారని అంటున్నారు. మొత్తానికి పవన్ అవసరాన్ని ఇన్నాళ్ళకు కేంద్ర బీజేపీ పెద్దలు గుర్తించి పిలిచారు.

దాన్ని జనసేనాని తనకు అనుకూలంగా మార్చుకుని టీడీపీతో కూడా బీజేపీ పొత్తుని ఖరారు చేయిస్తారని అదే టైం లో వైసీపీ వైపు బీజేపీ పెద్దలు మొగ్గు చూపకుండా అండగా ఉండకుండా కచ్చితంగా ఉండేలా ఒక హామీని కూడా తీసుకుంటారు అని అంటున్నారు.

మరి పవన్ తన అజెండాతో వెళ్తున్నారు. తన రోడ్ మ్యాప్ తో వెళ్తున్నారు. కానీ జాతీయ పార్టీ అయిన బీజేపీ వద్ద ఏపీకి సంబంధించిన రోడ్ మ్యాప్ ఉండకుండా ఉంటుందా వారు కూడా పవన్ కి చెప్పాల్సింది చెబుతారు కదా. మరి ఎవరు ఎవరిని కన్విన్స్ చేస్తారో ఒకటి రెండు రోజులలో తేలిపోతుంది అని అంటున్నరు.