పిక్ ఆఫ్ ది డే... పవన్ – లోకేష్ ల ఈ బంధం ఏనాటిదో..!
ఇదే సమయాల్లో.. రాజకీయాల్లో నిజమైన బంధాలు, ఆత్మీయ అనుబంధాలు తక్కువని.. ఇక్కడ కేవలం అవసరాలు మాత్రమే ఉంటాయని చెబుతారు!
By: Tupaki Desk | 24 July 2025 3:39 PM ISTరాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాస్వత మిత్రులు ఉండరని అంటారు! ఇదే సమయాల్లో.. రాజకీయాల్లో నిజమైన బంధాలు, ఆత్మీయ అనుబంధాలు తక్కువని.. ఇక్కడ కేవలం అవసరాలు మాత్రమే ఉంటాయని చెబుతారు! అయితే... పవన్ కల్యాన్ - లోకేష్ ని చూసినవారు మాత్రం వీరిది రాజకీయ బంధం కంటే ఎక్కువ అనే మాటలు చెబుతుంటారు. అందుకు కారణం వీరిద్దరూ!
అవును... కొణిదెల వారి కుటుంబంలో అందరికంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్నవారు! దీంతో... అన్నలిద్దరికీ ఆయన తమ్ముడు! కానీ... రాజకీయాల్లో మాత్రం ఆయనకు ఓ తమ్ముడు ఉన్నారు.. ఆయనే మంత్రి లోకేష్! సందర్భం ఏదైనా... పవన్ ను "పవన్ అన్నా" అని అప్యాయంగా పిలుస్తుంటారు, సంభోదిస్తుంటారు నారా లోకేష్.
ఈ క్రమంలో తాజాగా నేడు ఏపీ కేబినెట్ సమావేశానికి ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మంత్రి నారా లోకేష్ హృదయపూర్వకంగా కౌగిలించుకున్నారు. ఈ పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. రాజకీయాల్లో ఈ స్థాయి ఆత్మీయత అత్యంత అరుదనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సమయలో వారితో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, మనోహర్, కందుల దుర్గేష్ కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా... ఈ ఒక్క ఫోటో ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి బలంతో పాటు ఐక్యత గురించి చెప్పకనే చెబుతుందని.. ఏపీ భవిష్యత్తు రాజకీయాలను ఈ ద్వయం శాసించనుందనే సంకేతాలు ఈ కౌగిలింతలో కనిపిస్తున్నాయని అంటున్నారు! వీరి అనుబంధం ఇలా ఉన్నంతకాలం ఎపీలో కొన్ని దశాబ్ధలపాటు కూటమికి సమస్య ఉండదని చెబుతున్నారు!
కాగా... హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా "మా పవన్ అన్న" అంటూ లోకేష్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... పవర్ స్టార్ అభిమానుల్లాగే తానూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా... పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం అని లోకేష్ తెలిపారు.
కాగా... సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ కేబినెట్ భేటీలో సుమారు 40కి పైగా అజెండా అంశాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా... ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాకర్చరింగ్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలపనున్నట్టు చెబుతున్నారు. ఇదే సమయంలో.. అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి సీఆర్‌డీఏ అథారిటీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నట్లు తెలుస్తోంది.
