కోటప్పకొండకు పవన్ కల్యాణ్.. పూజలు-అభివృద్ధి!
అనంతరం అంతరాలయంలో త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న పవన్ కల్యాణ్.. నుదుటికి గంధం ధరించి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే కొద్ది సేపు ధ్యానం చేశారు.
By: Garuda Media | 22 Jan 2026 10:29 PM ISTఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని ప్రఖ్యాత శైవ క్షే త్రం కోటప్పకొండను సందర్శించారు. ఇక్కడ కొలువైన త్రికోశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కోటప్పకొండకు చేరుకున్న ఉపముఖ్యమంత్రికి ఆలయ అధికారులతోపాటు కూటమి పార్టీలనాయకులు ఘనస్వాగతం పలికారు.
అనంతరం అంతరాలయంలో త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న పవన్ కల్యాణ్.. నుదుటికి గంధం ధరించి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే కొద్ది సేపు ధ్యానం చేశారు. అనంతరం.. ఆలయ విశేషాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం.. కొత్తపాలెం గ్రామం నుంచి కోటప్పకొండ వరకు ఇటీవల నిర్మించిన రహదారిని ఆయన ప్రారంభించారు. ఈ నిర్మాణానికి ప్రభుత్వం 10 కోట్ల రూపాయలను కేటా యించింది.
ఈ రహదారి నిర్మాణాన్ని రికార్డు స్థాయి తక్కువ సమయంలోనే పూర్తి చేశారు. దీనిని పవన్ కల్యాణ్ ప్రారం భించారు. రోడ్డు నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రహదారి నిర్మాణాన్ని తక్కువ సమయంలో అత్యంత నాణ్యతతో పూర్తిచేసిన వారిని అభినందించారు. కాగా.. పవన్ కల్యాణ్ .. త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. దక్షిణా మూర్తిగా పరిగణించే కోటప్పకొండపై మహాశివరాత్రిని పురస్కరించుకుని నిర్వహించే తిరునాళ్లకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది.
