మోడీ ప్రతినిధిగా కీలక సమావేశానికి పవన్ అటెండ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తాజాగా చెన్నైలో పర్యటిస్తున్నారు. ఆదివారం రాత్రి ఆయన ఢిల్లీ నుం చి నేరుగా చెన్నై చేరుకున్నారు.
By: Tupaki Desk | 26 May 2025 3:30 PM ISTఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తాజాగా చెన్నైలో పర్యటిస్తున్నారు. ఆదివారం రాత్రి ఆయన ఢిల్లీ నుం చి నేరుగా చెన్నై చేరుకున్నారు. సోమవారం ఇక్కడ జరుగుతున్న ''వన్ నేషన్-వన్ ఎలక్షన్'' సమావేశం లో పాల్గొన్నారు. అయితే.. ఒక పార్టీ తరఫున, లేదా ఒక రాష్ట్రం తరపున ఆయన ఇక్కడ పాల్గొనలేదు. నేరు గా ప్రధాన మంత్రి సూచనల మేరకు.. ఆయన ప్రతినిధిగానే ఇక్కడకు రావడం గమనార్హం. కేంద్రం వన్ నేషన్-వన్ ఎలక్షన్ నినాదం వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో దక్షిణాది ప్రాంతీయ పార్టీలు.. రాష్ట్రాలతో కీలక సమావేశాన్ని చెన్నైలో ఏర్పాటు చేసింది. దీనికి టీడీపీ నుంచి చంద్రబాబు హాజరు కావాల్సి ఉంది. అయితే.. ఆయన బిజీగా ఉన్న కారణంగా.. వెళ్లలేక పోయారు. ఇక, ఆదివారం ఢిల్లీలో ప్రధానిని కలుసుకున్న పవన్.. ఆయన సూచనల మేరకు.. ఆయన ప్రతినిధిగానే చెన్నైకి వెళ్లారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై పవన్ స్పందించనున్నారు. అంతేకా దు.. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆయన వివరించనున్నారు.
ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానాన్ని కేంద్రంలోన మోడీ సర్కారు.. తరచుగా వినిపిస్తోంది. దీనిపై మాజీ రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదికను కూడా.. పార్లమెంటు ఆమోదించింది. అయితే.. దీనిని రాష్ట్రాలు ఆమోదించి.. కేంద్రానికి నివేదికలుపంపాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి ఇటీవలే శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా బీజేపీ యేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలను కూడా ఒప్పించేందుకు ప్రాంతాల వారీగా ప్రభుత్వం సమావేశాలు నిర్వహిస్తోంది.
