యోగా సభలో పవన్ స్కోర్ ఎంత ?
అయితే తాజాగా జరిగిన విశాఖ యోగా సభలో మాత్రం పవన్ కంటే లోకేష్ కే ఎక్కువ ప్రయారిటీ దక్కింది అని ప్రచారం సాగుతోంది.
By: Tupaki Desk | 22 Jun 2025 11:33 PM ISTవిశాఖలో జరిగిన అంతర్జాతీయ యోగా సభలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైలెట్ అవలేదా అన్న చర్చ అయితే సాగుతోంది. టీడీపీ కూటమిలో పవన్ అతి ముఖ్య నాయకుడు. ఆయన కూటమి ఏర్పడడం వెనక కీలక భూమికను పోషించారు అన్న చర్చ ఒక వైపు ఉంది. అంతే కాదు పవన్ వెనక బలమైన సామాజిక వర్గం ఉంది. ఆయన సినిమా క్రేజ్ మామూలుగా ఉండదు.
ఇక ఎపుడు ప్రధాని మోడీ ఏపీకి వచ్చినా పవన్ పెద్ద ఎత్తున హైలెట్ అవుతూంటారు. అంతవరకూ ఎందుకు అమరావతిలో మే 2న జరిగిన సభలో పవన్ తన ప్రసంగంలో దగ్గుతూంటే పవన్ కళ్యాణ్ ప్రసంగం పూర్తి అయిన తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో ప్రధాని మోదీ తన వద్దకు పిలిచి కఫ్ కేండీని పవన్ కళ్యాణ్‌కు ఇచ్చారు. అది అప్పట్లో సూపర్ హైలెట్ అయింది. ఇక సరిగ్గా ఏడాది క్రితం ఢిల్లీలో జరిగిన ఎన్డీయే కూటమి సమావేశంలో పవన్ ని సునామీగా ప్రధాని మోడీ అభినందించారు.
హర్యానాలో జరిగిన ఎన్డీయే సమావేశంలోనూ పవన్ ని ప్రత్యేకంగా దగ్గరకు పిలిపించుకుని ఆప్యాయంగా పలకరించారు. ఈ ఏడాది జనవరిలో విశాఖలో జరిగిన మోడీ సభలో సైతం పవన్ కి స్పెషల్ ట్రీట్మెంట్ లభించింది అని చెప్పుకున్నారు. అయితే తాజాగా జరిగిన విశాఖ యోగా సభలో మాత్రం పవన్ కంటే లోకేష్ కే ఎక్కువ ప్రయారిటీ దక్కింది అని ప్రచారం సాగుతోంది.
ఒక్క మాటలో చెప్పాలంటే లోకేష్ ఫుల్ ఫోకస్ అయ్యారు. ప్రధాని మోడీ పదే పదే ఆయన పేరు సభా వేదిక మీద చెప్పారు. దాంతో లోకేష్ లేకపోతే విశాఖలో అంతర్జాతీయ యోగా డే వంటి భారీ ఈవెంట్ జరిగి ఉండదని అంతా అంటున్నారు. అంతే కాదు కేంద్రంలో కీలకంగా ఉన్న బీజేపీ పెద్దలు లోకేష్ మీద ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్న సంకేతం కూడా ఈ సభ ద్వారా వెళ్ళింది అని అంటున్నారు.
అదే సమయంలో పవన్ యోగా డేకి వచ్చారా వెళ్ళారా అన్నట్లుగా సాగింది అంటున్నారు. పవన్ గురించి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పెద్దగా ఫోకస్ పెట్టలేదని అంతా లోకేష్ మయం యోగా అంతా లోకేష్ క్రెడిట్ ఖాతాలోనే అని ఎలివేట్ చేస్తోంది అన్న చర్చ కూడా సాగుతోంది.
దీంతో పాటు లోకేష్ కేవలం మంత్రిగా ఉన్నారు అయినా సరే ప్రధాని విశాఖ యోగా సభ మీద ఇచ్చిన ప్రకటనలు వేసిన ఫ్లెక్సీలలో ఎటు చూసినా ఆయన ఫోటో కూడా కలిపి వేయడం పట్ల కూడా చర్చ సాగుతోంది. లోకేష్ విశాఖకు సంబంధించిన మంత్రి కూడా కాదు కదా ఒక క్రీడలు ఆయన మంత్రిత్వ శాఖకు రావు కదా అని అంటున్నారు. అలాంటిది ఆయన ఫోటో వేయడం అంటే కావాలనే ఎలివేట్ చేస్తున్నారా అన్న మరో చర్చ కూడా సాగుతోందిట.
అంతే కాదు లోకేష్ గ్రాఫ్ ఇపుడు చూస్తే విశాఖలో యోగా సభకు ముందు తరువాత అన్నట్లుగా మారిపోయింది అని అంటున్నారు. విశాఖ సభ తరువాత లోకేష్ పార్టీలోనే కాదు ప్రభుత్వంలోనూ నంబర్ టూ అయిపోయారు అన్న వారూ ఉన్నారు. లోకేష్ సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ హైలెట్ కావడం లేదన్న చర్చ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఇది జస్ట్ యోగా వరకేనా లేక ముందు ముందు ఇలాగే సాగుతుందా అన్నదే అంతా చర్చించుకునే అంశంగా ఉంది.
