కష్టపడితే చాలు...పవన్ చూసుకుంటారు
జనసేనలో క్యాడర్ కి భరోసా ఇచ్చేందుకు అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధపడుతున్నారు. జనసేన పుట్టి పుష్కర కాలం గడచింది.
By: Satya P | 27 Feb 2026 12:00 PM ISTజనసేనలో క్యాడర్ కి భరోసా ఇచ్చేందుకు అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధపడుతున్నారు. జనసేన పుట్టి పుష్కర కాలం గడచింది. పార్టీ పట్ల అభిమానంతో లక్షలాది మంది పని చేశారు. అలాగే ఎంతో మంది నియోజకవర్గాల స్థాయిలో పార్టీకి పునాదులుగా నిలిచారు. అయితే వారందరి విషయంలో జనసేన పెద్దగా న్యాయం చేయలేకపోయింది అన్న అసంతృప్తి అయితే ఉంది. కానీ జనసేన అధినాయకత్వం మాత్రం వారికి అండగా ఉంటూ వారికే పెద్ద పీట వేయాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.
సభ్యత్వ నమోదుతో :
జనసేన తమ పార్టీగా భావించి జనంలో పార్టీని బలోపేతం చేస్తున్న వారిని పార్టీ ఎపుడూ గుర్తు పెట్టుకుంటుంది అని అంటున్నారు. పార్టీ ఇపుడు సభ్యత్వ నమోదు అనే ప్రక్రియలో ఉంది. సభ్యత్వ నమోదుని పెద్ద ఎత్తున చేయాలని లక్షలాదిగా సభ్యత్వం చేర్పించాలని కూడా డిసైడ్ అయింది. దీని కోసం పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేస్తోంది. పార్టీ చెప్పిన దాని ప్రకారం పనిచేస్తూ చురుకుగా సభ్యత్వ నమోదు చేసిన వారిని గుర్తించి వారికి పార్టీ పరంగా పెద్ద పీట వేస్తారు అని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే వారిని పార్టీలో కీలక పదవులలో నియమించాలని కూడా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
ఈసారి వారికే అంతా :
మరో వైపు చూస్తే పార్టీ పదవులు అలంకరించిన వారు రానున్న మూడేళ్ళ కాలంలో గట్టిగా పనిచేసే కనుక వారికే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను చేయాలని కూడా అధినాయకత్వం ఆలోచిస్తోంది.అని అంటున్నారు. 2024 ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారని ఒక రకమైన అసంతృప్తి అయితే పార్టీలో ఉంది. ఆ విధంగా ఈసారి కాకుండా నిజమైన జనసేన నాయకులకు అగ్ర తాంబూలం ఇవ్వాలని పార్టీ కృత నిశ్చయంతో ఉంది అని అంటున్నారు.
ఎక్కువ సీట్లు వస్తాయి :
ఈసారి జనసేన ఎక్కువ సీట్లు కూటమి తరఫున తీసుకుని పోటీ చేస్తుంది అని అంటున్నారు. అంటే 21 కి మరో 21 అయినా కలుపుకుని గరిష్టంగా 42 సీట్లతో పోటీ ఉంటుందని అంటున్నారు. ఆ మేరకు కొత్త వారికి మంచి అవకాశాలు లభిస్తాయని అంటున్నారు. అంతే కాదు ఈసారి 21 మంది ఎమ్మెల్యేలతో సరిగ్గా పనితీరు కనబరచని వారు అలాగే వయో భారంతో ఉన్న వారి ప్లేస్ లో కూడా కొత్త వారిని తీసుకుని వారిని ఎమ్మెల్యేలుగా చేసే ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు.
జనసేన పటిష్టంగా :
గతంలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో అనుభవం ఉన్న వారిని తీసుకోవాల్సి వచ్చిందని ఇపుడు ఆ ఇబ్బంది లేదని జనసేన అధినాయకత్వం భావిస్తోంది అని అంటున్నారు. పార్టీ అధికారంలో ఉండడంతో బలోపేతం అయిందని దానికి తోడు నాయకులు కూడా బలంగా ఉన్న చోట పార్టీ నుంచి వారినే ప్రోత్సహించేందుకు కూడా యాక్షన్ ప్లాన్ రెడీ అవుతోంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే జనసేనలో ఈసారి జంపింగ్స్ రాయుళ్ళ కంటే కూడా అసలు సిసలైన నాయకులకే టికెట్లు అధికంగా దక్కబోతున్నాయని ప్రచారం అయితే సాగుతోంది.
