కొణిదెలకు 50 లక్షలు..చేతికి ఎముక లేని పవన్..ఏడాదిలో ఇన్ని విరాళాలా?
తాజాగా కొణిదెల అనే పేరున్న గ్రామానికి పవన్ రూ.50 లక్షలు ఇచ్చారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో ఉందీ గ్రామం.
By: Tupaki Desk | 12 Jun 2025 2:00 AM ISTఎవరైనా అడిగిందే తడువుగా విరాళాలు ఇచ్చేస్తుంటే.. వారి చేతికి ఎముక లేదు అనేది తెలుగులో బాగా పాపులర్ అయిన పదం.. ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విషయంలోనూ ఇదే మాట చెబుతారేమో..? వీలైతే దానం.. కుదిరితే సాయం అన్నట్లుగా ఆయన తీరు సాగిపోతోంది. ఎక్కడ ఆపద వచ్చినా తాను ఉన్నానంటూ ఎంతోకొంత ఆర్థిక భరోసా కల్పిస్తూ తనది పెద్ద మనసు అని చాటుతుంటారు. వాస్తవానికి సినిమా హీరోగా ఉన్నప్పుడూ పవన్ దానాలు చేసేవారని అంటారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం ఆయన చేస్తున్న సాయం బయటకు వస్తోంది.
ఇంటి పేరుకే రూ.50 లక్షలు
తాజాగా కొణిదెల అనే పేరున్న గ్రామానికి పవన్ రూ.50 లక్షలు ఇచ్చారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో ఉందీ గ్రామం. కొణిదెల అనేది పవన్ కళ్యాణ్ ఇంటిపేరు అనేది అందరికీ చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఈ గ్రామానికి ఆయన నేరుగా వెళ్లలేదు. కర్నూలు జిల్లా పూడిచర్ల అనే గ్రామంలో పంట కుంటల నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు.. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య కొణిదెల గ్రామం గురించి చెప్పారు. దీంతో తమ ఇంటిపేరుతో ఉన్న ఈ గ్రామాన్ని సొంత నిధులతో డెవలప్ చేస్తానని చెప్పి.. మాట ప్రకారం రూ.50 లక్షలు ఇచ్చారు.
-పెహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన్ కుటుంబానికి పవన్ రూ.50 లక్షల వ్యక్తిగత సాయం చేశారు.
-తలసీమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న పవన్.. ట్రస్ట్ కు రూ.50 లక్షల సాయం ప్రకటించారు.
-ఏపీ, తెలంగాణలో నిరుడు వరదల సమయంలో జరిగిన నష్టానికి రూ.6 కోట్లు విరాళం అందజేశారు.
- జనసేన క్రియాశీల కార్యకర్తల ప్రమాద బీమాకు రూ.కోటి సొంత నిధులను కేటాయించారు.
-సొంత నియోజకవర్గం పిఠాపురంలో 325 మంది ఎలక్ట్రిషియన్లకు రూ.16 లక్షల ఖర్చుతో సేఫ్టీ కిట్ లు అందించారు.
సరిగ్గా ఏడాది కిందట ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి లెక్క వేస్తే పవన్ చేసిన దానాల మొత్తం రూ.20 కోట్లు ఉంటుందని జనసేన కార్యకర్తలు గొప్పగా చెప్పుకొంటున్నారు. ఈ మేరకు ట్వీట్లు చేసుకుంటున్నారు.
