Begin typing your search above and press return to search.

పొగడ్తలు అవసరం లేదు.... కుండబద్ధలు కొట్టిన పవన్

సినీ హీరో నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు.

By:  Satya P   |   30 Jan 2026 7:05 PM IST
పొగడ్తలు అవసరం లేదు....  కుండబద్ధలు కొట్టిన పవన్
X

సినీ హీరో నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. ఆయన తాను తలపెట్టిన పనిలో ప్రజలకు మేలు జరగాలని చూస్తున్నారు. తన శాఖలలో నిబద్ధతతో పనిచేసే విధంగా అధికారులు వ్యవహరించాలని గట్టిగా కోరుకుంటున్నారు. తన ముద్ర బలంగా కీలకమైన పంచాయతీరాజ్ శాఖలో ఉండాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేస్తూనే అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని కూడా సూచించారు.

పొగడ్తలు వద్దు :

తనకు పొగడ్తలు చప్పట్లు అసలు అవసరం లేదని పవన్ కుండ బద్ధలు కొట్టారు. మీ నుంచి పని నేను ఆశిస్తున్నాను అని అధికారులతో ఆయన స్పష్టంగా చెప్పారు. విధి నిర్వహణలో అలసత్వాన్ని సహించమని పవన్ పేర్కొన్నారు. అంతే కాకుండా ⁠నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైనా పని పట్ల ఏ ఒక్కరు అయినా నిర్లక్ష్యం వహించినా కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజల సంతోషం వారి సంక్షేమమే ధ్యేయంగా అంతా కలసి పని చేద్దామని ఆయన కోరారు. విశాఖలో పవన్ పర్యటనలో భాగంగా పంచాయతీ రాజ్ శాఖ మీద పూర్తి స్థాయి సమీక్ష చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

జవాబుదారీతనం ముఖ్యం :

ఏపీలో కూటమి ప్రభుత్వం నిబద్దత పారదర్శకతతో ముందుకు వెళ్తుందని ఆయన చెప్పారు. చిత్తశుద్ధి జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించండని మొత్తం యంత్రాంగాన్ని ఆయన కోరారు. ⁠ పంచాయతీరాజ్ శాఖను ప్రభావవంతమైన శాఖగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం కావాలని ఆయన కోరారు. అవినీతికి తావులేకుండా ప్రతి ఒక్కరు పని చేయాలని పవన్ చెప్పడం విశేషం.

కావాల్సింది అదే అంటూ :

శాఖాపరంగా పనిచేస్తేనే తనకు సంతోషం కలుగుతుందని అంతే తప్ప పొగడ్తల వల్ల కాదని పవన్ చెప్పారు. సోషల్ ఆడిట్ కూడా మొక్కుబడిగా కాకుండా పక్కాగా జరగాలని ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ ఆదేశించడం విసేషం. అలగే . క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రతి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు అందాలని ఆయన కోరారు.

రాజకీయ సిఫార్సులు రావు :

ఇక తన వైపు నుంచి ఎలాంటి రాజకీయ ఒత్తిడులు సిఫార్సులు అధికారులకు ఉండవని పవన్ చెప్పారు. అందువల్ల ప్రతి అధికారి నిబంధనలకు లోబడి మాత్రమే పని చేయాలని పవన్ అన్నారు. గత ప్రభుత్వంలో పని చేసిన కొంత మంది అధికారులు ఇప్పటికీ ఆ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారని పవన్ ఆక్షేపించారు. అదే విధంగా ప్రభుత్వ పాలసీల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. అటువంటి వారి విషయంలో పనిలో అలసత్వాన్ని అసలు సహించమని పవన్ స్పష్టం చేశారు.

ఎన్నో సంస్కరణలు అమలు :

పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేసేందుకు ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. . ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా పూర్తి చేశామని చెప్పారు. అలాగే ఒకేసారి పది వేల మందికి పదోన్నతులు కల్పించి ప్రభుత్వంగా చిత్తశుద్ధిని చాటుకున్నామని అన్నారు. ఇక అధికారులు సిబ్బందికి . ఏ కష్టం వచ్చినా అండగా ఉంటున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆలోచనలకు కష్టానికి సార్ధకత చేకూరేలా అధికారులు పని చేయాలని పవన్ కోరడం విశేషం.