వన్ ఇయర్ పవర్ : పవన్ పై అదిరిపోయే వీడియో..
2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ పదేళ్ల పాటు రాజకీయంగా చాలా పోరాటమే చేశారు.
By: Tupaki Desk | 12 Jun 2025 3:08 PM ISTకూటమి ప్రభుత్వం ఏడాది పాలనను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటోంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తమ ఏడాది జర్నీకి గుర్తుగా పలు కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ పరంగా తల్లికివందనం నిధులు విడుదల చేయడంతోపాటు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ పై జనసేన పార్టీ ఓ వీడియో రిలీజ్ చేసింది.
2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ పదేళ్ల పాటు రాజకీయంగా చాలా పోరాటమే చేశారు. 2024లో కూటమిగా ఏర్పడి టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఘనం విజయం సాధించిన విషయం తెలిసిందే. 164 సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి పవన్ కల్యాణ్ చొరవే కారణమని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో జనసేనానిని డిప్యూటీ సీఎంగా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక బాధ్యతలు అప్పగించారు.
పవర్ లోకి వచ్చిన తొలి ఏడాదిలో పవన్ తన పవర్ చూపారని చెబుతూ జనసేన ప్రత్యేక వీడియో రిలీజ్ చేసింది. డిప్యూటీ సీఎంగా పవన్ వన్ ఇయర్ జర్నీకి గుర్తుగా ఈ ఏడాదిలో ఆయన చేపట్టిన పలు కార్యక్రమాలు, దినపత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్ క్లిప్పింగులతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
జనసేన పార్టీ పోస్టు చేసిన పవన్ వీడియో అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్సలోనూ వైరల్ అవుతోంది. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే ఇన్ స్టాలో దాదాపు 50 వేల లైకులు వచ్చాయి. అదేవిధంగా యూట్యూబ్, ఎక్స్, ఫేస్ బుక్ తోపాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోనూ పవన్ వీడియోకు మంచి స్పందన వస్తుందని చెబుతున్నారు.
