స్పీడ్ ఆఫ్ డెవలప్‌మెంట్.. పవన్ వెర్షన్!
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. అనే మాట విన్నాం. కానీ, తొలిసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. `స్పీడ్ ఆఫ్ డెవలప్‌మెంట్ గవర్నమెంట్` అనే విషయాన్ని వెల్లడించారు.
By: Tupaki Desk | 26 Jun 2025 10:52 AMస్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. అనే మాట విన్నాం. కానీ, తొలిసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. `స్పీడ్ ఆఫ్ డెవలప్‌మెంట్ గవర్నమెంట్` అనే విషయాన్ని వెల్లడించారు. ఇప్పటి వరకు ఆయన ఎప్పు డూ స్పీడ్ ఆఫ్ డెవలప్‌మెంట్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ, తొలిసారి దీని గురించి స్పందిం చారు. రాజమండ్రిలో ఆయన అఖండ గోదావరి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధి, సుస్థిర ప్రభుత్వంపై కామెంట్లు చేశారు.
రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే.. మరీ ముఖ్యంగా వేగవంతమైన అభివృద్ధి జరగాలంటే.. అది సుస్థిర ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. దీనికి శక్తిమంతులైన నాయకులు ఉండాల్సిన అవసరం ఉంద న్నారు. ``శక్తిమంతులైన నాయకులు ఉంటేనే వేగవంతమైన అభివృద్ధి జరుగుతుంది. ఇది సుస్థిర ప్రభు త్వంతోనే సాధ్యమవుతుంది.`` అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఆయన సీఎం చంద్రబా బు, కూటమి ప్రభుత్వాలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
ఇక, ప్రస్తుతం చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా వచ్చే రెండు మూడేళ్లలోనే ప్రపంచ పర్యాటకు లు రాష్ట్రానికి క్యూ కడతారని చెప్పారు. తద్వారా రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుందని వెల్లడించారు. అంతేకాదు.. పర్యాటక రంగంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగు పడుతున్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా ఏటా 4 లక్షల మంది దేశ, విదేశీ పర్యాటకులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని.. తద్వారా స్థానికులకు వ్యాపారాలు పుంజుకుని,రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుంద న్నారు. ఇదంతా స్పీడ్ ఆఫ్ డెవలప్మెంటు ద్వారానే సాధ్యమవుతోందని చెప్పారు.