బాబుకు పవన్ మిత్రుడు కాదు... !
చంద్రబాబు అంటే పవన్ కి ఆరాధనాభావం ఎంతో అన్నది ఆయన మాటలలోనే వ్యక్తం అవుతుంది. చంద్రబాబులోని పాలనాదక్షుడికే పవన్ ఒక వీరాభిమానిగా అయిపోయారు అని కూడా చెబుతారు.
By: Tupaki Desk | 30 May 2025 9:19 AM ISTచంద్రబాబు అంటే పవన్ కి ఆరాధనాభావం ఎంతో అన్నది ఆయన మాటలలోనే వ్యక్తం అవుతుంది. చంద్రబాబులోని పాలనాదక్షుడికే పవన్ ఒక వీరాభిమానిగా అయిపోయారు అని కూడా చెబుతారు. బాబు విజన్ ఆయన ఆలోచనలు భవిష్యత్తు మీద ఆయన ఎప్పటికపుడు వేసుకున్న అంచనాలు, ఆయన సవాళ్ళ నుంచి ధీటుగా ఎదిగి అనుకున్న లక్ష్యాలను చేరుకున్న తీరు పవన్ కి చాలా నచ్చాయని విశ్లేషిస్తారు.
సరే ఇవన్నీ చాలా మంది నాయకులకు కూడా నచ్చుతాయి. కానీ ఎవరూ పవన్ మాదిరిగా బయటకు చెప్పరు. లౌక్యంగా ఉంటారు. ఎందుకంటే తమ పార్టీ తమకు ఉంటుంది కనుక. కానీ పవన్ లో రాజకీయ నేత కంటే ఒక సగటు నాయకుడే ఉంటారని చెప్పాల్సి ఉంది. అంతే కాదు ఆయన ఏపీ అభివృద్ద్ధి దేశాభివృద్ధిని ఎంతో విపరీతంగా కాంక్షిస్తారు. అందుకే ఆయన నరేంద్ర మోడీని చంద్రబాబుని బాగా ఇష్టపడతారు.
లేకపోతే ఒక మిత్ర పక్ష నాయకుడు ఒక పార్టీ పండుగ వేళ వరసబెట్టి ట్వీట్లు వేసి మరీ మెచ్చుకోవడం అంటే వర్తమాన రాజకీయాల్లో మామూలు విషయం అయితే కానే కాదు అని చెప్పాలి. బాబు ఈజ్ గ్రేట్ అని బాహాటంగా ఎన్నో సార్లు పవన్ చెప్పారు. ఆ విషయం చెప్పడానికి ఆయనకు ఎలాంటి భేషజాలూ అడ్డుపడవు. ఆయన ఉన్నది ఉన్నట్లుగానే చెప్పేస్తారు.
మహానాడు ప్రారంభం వేళ ఆ పార్టీ పెద్దలను గ్రీట్ చేస్తూ పవన్ వేసిన ట్వీట్ ఎంతటి స్థాయిలో వైరల్ అయిందో అందరూ చూశారు. ఇక రెండవ రోజున బాబు మరోసారి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక అయిన సందర్భంగా పవన్ మరో ట్వీట్ వేసి మరీ బాబుని కొనియాడారు.
బాబుది ప్రగతిశీలనాయక్త్వం అన్నారు. ప్రజా సేవ పట్ల బాబుకు అచంచల నిబద్ధత ఉందని చెప్పారు. ఒకసారి కాదు ఏకంగా 12వ సారి టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన బాబు నాయకత్వం పార్టీకే కాదు ఏపీకి మార్గదర్శకంగా ఉంటుందని పవన్ ప్రశంసించారు.
మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ బాబు నాయకత్వాన్ని వేయి నోళ్ళతో పొగిడారు. జనసేన అధినేతగా ఉంటూ ఇంతలా బాబు గురించి ఓపెన్ అయి మాట్లాడడం పవన్ కే చెల్లింది అని అంటున్నారు. ఆయన పక్క పార్టీ నాయకుడిని అని కానీ మిత్ర పక్షంగా ఉన్నాను అని ఒక పరిధి పరిమితి పెట్టుకుని కానీ మాట్లాడడం లేదు అని అర్ధం అవుతోంది.
బాబు గురించి చెప్పడం ద్వారా ఆయన నాయకత్వాన్ని మరింతగా బలోపేతం చేయడం ద్వారా పవన్ ఏపీ సర్వతోముఖాభివృద్ధిని మనసారా కోరుకుంటున్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే బాబు జీవితంలో ఎందరితో టీడీపీకి పొత్తులు కుదిర్చారు ఎందరో ఆ పార్టీకి మిత్రులుగా ఉన్నారు. కానీ పవన్ మాదిరి మిత్రుడిని బాబు ఇప్పటిదాకా చూసి ఉండరు. మొత్తానికి పవన్ బాబుకు మిత్రుడు అందామా అంటే కానే కాదు అంతకు మించి అనే అంటున్నారు అంతా. సో ఈ ఇద్దరి మధ్య ఉన్న ఆ అద్వితీయ బంధమే కూటమి సుస్థిరతకు శ్రీరామ రక్ష అన్నది ఒక అందమైన విశ్లేషణ.
