మోడీ జట్టు అంటున్న పవన్ ?
ఇది నిజమేనా అంటే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. ప్రచారాలు అన్నీ నిజాలు కావాలని లేదు.
By: Tupaki Desk | 9 May 2025 9:03 AM ISTఇది నిజమేనా అంటే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. ప్రచారాలు అన్నీ నిజాలు కావాలని లేదు. నిజమైనా ఆశ్చర్యం లేదు అందువల్ల పవన్ విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని కూడా చూస్తే కనుక ఏమో ఇది కూడా పాజిబుల్ కదా అనిపించకమానదు. ఇంతకీ పవన్ విషయంలో జరుగుతున్న ప్రచారం ఏమిటి అన్నది చూస్తే కనుక ఆయన మనసు జాతీయ స్థాయి రాజకీయాల పైన ఉంది అని అంటున్నారు.
ఆయన కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు అని కూడా అంటున్నారు అదేమిటి ఏపీలో ఎన్నికలు జరిగి ఏడాది కాలేదు కూటమి ప్రభుత్వం తొలి వార్షికోత్సవం ఇంకా జరుపుకోలేదు కదా అని కూడా అనుకోవచ్చు. కానీ అది ఇపుడు కాదు, మళ్ళీ ఎపుడు ఎన్నికలు జరిగితే అపుడు అని అంటున్నారు. బహుశా అవి జమిలి ఎన్నికలు కావచ్చు, లేదా సార్వత్రిక ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం 2029లో అయినా కావచ్చు.
ఈసారి పవన్ పోటీ చేసేది ఎంపీగానే అని అంటున్నారు అంటే పిఠాపురానికి ఆయన దూరం అవుతారా అంటే లేదు ఆయన సోదరుడు నాగబాబు అక్కడ ఉంటారని అంటున్నారు. అంటే పవన్ స్ట్రాటజీ ఏమిటి అంటే తాను ఎంపీగా పోటీ చేసి గెలిచి 2029 ఎన్నికల తరువాత కేంద్రంలో మరోసారి ఏర్పాటు అయ్యే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మంత్రిగా చేరాలని అనుకుంటున్నారు అని ప్రచారం సాగుతోంది.
ఇక పిఠాపురం నుంచి పవన్ కి బదులుగా నాగబాబు పోటీ చేయవచ్చు అంటున్నారు. నాగబాబు ఈ టెర్మ్ లోనే మంత్రిగా ఉంటారని అలా ప్రభుత్వంలో పనిచేయడం ద్వారా అనుభవాన్ని సంపాదించి ఆయన రాష్ట్ర స్థాయిలో జనసేనకు బలంగా మారుతారని అంటున్నారు. పవన్ బీజేపీ అప్పగించిన జాతీయ స్థాయి బాధ్యతలను చూస్తూ కేంద్రంలో మంత్రిగా ఉంటారని అంటున్నారు.
ఇలా ఎందుకు అంటే ఏపీలో చంద్రబాబు సీనియర్ గా ఉన్నారు. కూటమికి పెద్దగా ఆయనే ఉన్నారు. ఆయన ఉన్నంతవరకు పవన్ కి సీఎం గా చాన్స్ రాదు, దాంతో ఉప ముఖ్యమంత్రిగానే మిగిలిపోవాల్సి ఉంటుంది. రాజ్యాంగంలో లేని ఈ పదవి వల్ల ఎలాంటి అధికారాలు ప్రత్యేకగా ఉండవు. ఆయన కూడా ఒక మంత్రిగానే ఉండాలి అందుకే ఉప ముఖ్యమంత్రి పదవి కంటే కేంద్ర మంత్రి పదవి కేబినెట్ బెర్త్ తో కూడినది తీసుకుంటే కనుక అది సీఎం పోస్టుకు సరిసమానం అవుతుందని అంటున్నారు.
ఆ విధంగా అధికారికంగా ప్రమోషన్ కోసం పవన్ చూస్తున్నారు అని అంటున్నారు. ఏపీలో ఎన్నాళ్ళూ ఉన్నా బాబు పక్క సీటే తప్ప పెద్ద సీటు ఇప్పట్లో దక్కదని భావించే పవన్ మోడీ జట్టులో చేరేందుకు చూస్తున్నారు అని అంటున్నారు బీజేపీ పెద్దలు సైతం పవన్ ని జాతీయ రాజకీయాల్లోకి తీసుకుని వచ్చేందుకు చూస్తున్నారు
పవన్ కి దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను అప్పగించడం ద్వారా కమల వికాసానికి దారులు వెతుక్కోవచ్చు అన్నది వారి ఆలోచనగా ఉంది. ఏది ఏమైనా పవన్ మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎంపీగానే పోటీ చేస్తారు అని అంటున్నారు. మొత్తానికి నాగబాబు రాష్ట్రానికి పవన్ జీ కేంద్రానికి షిఫ్ట్ అవుతారు అన్నది ప్రచారంగా ఉంది జమిలి ఎన్నికలు అయితే జరిగితే ఏమో కానీ సార్వత్రిక ఎన్నికలకు చాలా టైం ఉంది కాబట్టి ఈ ప్రచారాన్ని అలా ఆస్వాదించడమే అని అంటున్నారు అంతా.
