Begin typing your search above and press return to search.

భార్యను భూతం.. పిశాచి అనటం క్రూరత్వం కాదన్నఆ హైకోర్టు

కింది కోర్టులు తీర్పులు ఇచ్చిన ఏడాది జైలుశిక్షను హైకోర్టు న్యాయమూర్తి రద్దు చేశారు. అంతేకాదు.. భార్యను ఉద్దేశించి భూతం.. పిశాచి అనటం క్రూరత్వం కిందకు రాదన్న విషయాన్ని పేర్కొంది.

By:  Tupaki Desk   |   31 March 2024 4:30 PM GMT
భార్యను భూతం.. పిశాచి అనటం క్రూరత్వం కాదన్నఆ హైకోర్టు
X

ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేసింది పాట్నా హైకోర్టు. ఒక విడాకుల కేసు విచారణ సందర్భంగా ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఆసక్తికరంగా మారింది. కింది కోర్టులు విధించిన జైలుశిక్షను రద్దుచేయటమే కాదు.. కీలక వ్యాఖ్య చేసింది. భార్యను ఉద్దేశించి భూతం.. పిశాచి అంటూ భర్త వ్యాఖ్యలు చేయటం క్రూరత్వం కిందకు రాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇంతకూ అలాంటి వ్యాఖ్యను హైకోర్టు ఎందుకు చేసిందన్న విషయంలోకి వెళితే..

జార్ఖండ్ లోని బొకారోకు చెందిన నరేశ్ కుమార్ గుప్తాకు 1993లో బిహార్ లోని నవదా పట్టణానికి చెందిన మహిళతో పెళ్లైంది. అనంతరం అదనపు కట్నంలో భాగంగా కారు కావాలన్న డిమాండ్ చేస్తూ.. తన భర్త.. అతడి తండ్రి తనను శారీరకంగా.. మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ 1994లో నవదాలోని పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. దీంతో తండ్రీ కొడుకులపై కేసులు నమోదయ్యాయి.

ఈ కేసు నలందా జిల్లాకు బదిలీ అయ్యింది. తండ్రీకొడుకులకు 2008లో నలందా కోర్టు ఏడాది జైలుశిక్షను విధిస్తూ తీర్పును ఇచ్చింది. జైలుశిక్షను వ్యతిరేకిస్తూ అప్పీల్ కు వెళ్లగా.. పదేళ్ల తర్వాత దాన్ని రిజెక్టు చేయటంతో వారిద్దరూ పాట్నా హైకోర్టును ఆశ్రయించారు. ఇంతలో భార్యభర్తలకు జార్ఖండ్ హైకోర్టు విడాకుల్ని మంజూరు చేసింది. ఇదిలా ఉండగా తండ్రీకొడుకులు దాఖలు చేసుకున్న పిటిషన్ పై పాట్నా హైకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ బిబేక్ చౌదరి పర్యవేక్షణలోని ధర్మాసనంలో ఈ కేసును విచారించారు.

కింది కోర్టులు తీర్పులు ఇచ్చిన ఏడాది జైలుశిక్షను హైకోర్టు న్యాయమూర్తి రద్దు చేశారు. అంతేకాదు.. భార్యను ఉద్దేశించి భూతం.. పిశాచి అనటం క్రూరత్వం కిందకు రాదన్న విషయాన్ని పేర్కొంది. 21వ శతాబ్దిలో ఒక మహిళను అత్తింటి వారు భూతం.. పిశాచి అంటూ ఘోరంగా దూషించారని.. దారుణంగా వ్యవహరించారన్న వాదనలో అర్థం లేదని తేల్చింది. విఫలమైన వివాహ బంధాల్లో దంపతులు పరస్పరం తిట్టుకునే సందర్భాలు చాలా వస్తుంటాయని అభిప్రాయ పడింది. దీనికి తోడు సదరు మహిల నిర్దిష్టమైన ఆరోపణల్ని తండ్రీ కొడుకుల్లో ఏ ఒక్కరి మీదా చేయకపోవటం వల్ల కింద కోర్టులు విధించిన జైలుశిక్షను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.