Begin typing your search above and press return to search.

పస్మాండ ముస్లింలపై కన్నేసిందా ?

ఇందుకు అవసరమైన అన్ని వ్యూహాల ను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే పస్మాండ ముస్లింలపైన కూడా కన్నేసినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   3 Aug 2023 5:33 AM GMT
పస్మాండ  ముస్లింలపై కన్నేసిందా ?
X

రాబోయే ఎన్నికల్లో సొంతంగానే అధికారం లోకి వచ్చేంత స్థాయికి చేరుకోవాలని నరేంద్రమోడీ గట్టి నిర్ణయంతో ఉన్నారు. ఇందుకు అవసరమైన అన్ని వ్యూహాల ను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే పస్మాండ ముస్లింలపైన కూడా కన్నేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ పస్మాండ అంటే ఏమిటి ? పస్మాండ ముస్లింలు అంటే ఎవరు ? పస్మాండ అంటే అత్యంత వెనుకబడిన వారని అర్ధం. పస్మాండ్ అనే పదం పర్షియా లో నుండి వచ్చింది. అంటే పర్షియాయే పస్మాండ గా రూపాంతరం చెందింది.

ముస్లింల్లో కూడా అత్యంత వెనుకబడి, అణగారిన వర్గాల వారిని పస్మాండ ముస్లిలంటారు. ముస్లింల్లో 85 శాతం పస్మాండ వర్గాల వారే ఉన్నారట. ఇలాంటి వారు దేశం లోని 65 పార్లమెంటు నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నట్లు బీజేపీ గుర్తించింది.

ముస్లింల్లో అత్యధిక శాతం ఉన్న తమను ఏ ప్రభుత్వం కూడా గుర్తించటంలేదని అఖిల భారత పస్మాండ ముస్లం సమాజ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆలీ అప్షర్ అన్సారీ చెప్పారు. సచార్ కమిటీ, రంగనాధ మిశ్ర కమిటీల నివేదికల్లో కూడా పస్మాండ ముస్లింల స్ధితిగతుల పై ప్రస్తావన ఉందట.

65 పార్లమెంటు నియోజకవర్గాల్లో 35 శాతం కు పైగా ముస్లింలున్న నియోజకవర్గాలను బీజేపీ గుర్తించింది. ఈ నియోజకవర్గాల్లో పస్మాండ ముస్లింల కు టికెట్లు కేటాయించటం ద్వారా ముస్లింలందరినీ తమవైపుకు తిప్పుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా అర్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్ లోని రాష్ట్రీయ అల్ప సంఖ్యాక్ మోర్చా అధ్యక్షుడిగా అబ్దుల్ రషీద్ అన్సారీని, ప్రధాన కార్యదర్శిగా పస్మాండ నేత సాబీర్ ఆలీని నియమించింది.

అయితే బీజేపీకి ఎక్కడ సమస్యలు వస్తున్నాయంటే ముస్లింల పై ఉత్తరప్రదేశ్ లో విచక్షణా రహితంగా దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు ఓట్లు, సీట్లకోసం బుజ్జగిస్తూ, పదవులు కట్టబెడుతు మరోవైపు విచక్షణా రహితంగా దాడులు చేస్తున్నారని గోల పెరిగిపోతోంది.

మొన్న ఎన్నికలు జరిగిన కర్నాటక లో ముస్లిం పాపులేషన్ సుమారు 13 శాతముంది. అయితే ముస్లింల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వలేదు. పైగా ముస్లిం ఓట్లు తమకు అవసరం లేదని బీజేపీ నేతలు బహిరంగంగా ప్రకటించారు. అయితే ఓటమి తర్వాత ముస్లింల ను దూరంచేసుకున్నామని చెంపలేసుకున్నారు. మరి రేపు ఏమి జరుగుతుందో చూడాలి.