Begin typing your search above and press return to search.

42 మంది మృతి.. 27 మంది గల్లంతు!... తెరపైకి ఒళ్లు గగుర్పొడిచే విషయాలు!

అవును... పాశమైలారంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఇప్పటివరకూ 42 మంది మృతి చెందినట్లు తెలుస్తుండగా.. మరో 43 మంది గల్లంతైనట్లు అనుమానిస్తున్నారు.

By:  Tupaki Desk   |   1 July 2025 12:18 PM IST
42 మంది మృతి.. 27 మంది గల్లంతు!... తెరపైకి  ఒళ్లు గగుర్పొడిచే విషయాలు!
X

సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరు మండంలోని పాశమైలారంలో జరిగిన ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇదే సమయంలో తెరపైకి షాకింగ్ సందేహాలు వస్తున్నాయి. ఈ క్రమంలో... ఇప్పటి వరకూ 42 మంది మృతి చెందినట్లు చెబుతున్నారు! ఈ సమయంలో.. పలువురి మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.

అవును... పాశమైలారంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఇప్పటివరకూ 42 మంది మృతి చెందినట్లు తెలుస్తుండగా.. మరో 27 మంది గల్లంతైనట్లు అనుమానిస్తున్నారు. వీరిలో కొంతమంది శిథిలాల కింద ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలగించే పనిలో ఉన్నారు! ఈ రోజు సాయంత్రానికి సహాయకచర్యలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

ఆస్పత్రిలో ఉన్నవారి పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు. మరోవైపు పేలుడు వల్ల ఏర్పడిన వేడికి మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో కాలిపోయినట్లు చెబుతున్నారు. దీంతో... డీఎన్‌ఏ పరీక్షల ద్వారా మృతదేహాల గుర్తించేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమయలో గల్లంతైన వారి గురించి ఓ షాకింగ్ సందేహం తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... ఎయిర్ వాక్స్ / డ్రయ్యర్ సమీపంలో విధులు నిర్వహించేవారు చనిపోతే వారి బూడిద కూడా దొరకదని అధికరులు అంచాన వేస్తున్నారు. ఆ భారీ పేలుడు ధాటికి ఎముకలతో సహా సహజీవనం అవుతారని చెబుతున్నారు. దీంతో... ఈ విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు. ఘటనా స్థలంలో దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి.

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రేవంత్‌!:

పాశమైలారం ప్రమాద స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పరిశీలించారు. అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు. ఈ సమయంలో సీఎం వెంట మంత్రులు వివేక్‌, రాజనర్సింహ, పొంగులేటి, శ్రీధర్‌ బాబు ఉన్నారు.