Begin typing your search above and press return to search.

ప్రజల కోసమే పార్టీలు మారారంట... ఆయన కోసం కాదు!

ఈ క్రమంలో తాజాగా తెలంగాణ అసెంబ్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యవహారం హాట్ హాట్ గా నడిచింది.

By:  Tupaki Desk   |   21 Dec 2023 10:10 AM GMT
ప్రజల కోసమే పార్టీలు మారారంట... ఆయన కోసం కాదు!
X

రాజకీయ నాయకులు పార్టీలు మారడం అన్నది ఇటీవల కాలంలో అత్యంత సహజమైపోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కొంతమంది పార్టీలకు రాజీనామాలు చేసి ఇతర పార్టీలోకి పోతూ ప్రజాస్వామ్య గౌరవాన్ని కాస్త కాపాడుతుంటే... మరికొంతమంది మాత్రం ప్రజాభిప్రాయాన్ని అవహేళన చేస్తూ, అనైతికంగా ఒక పార్టీలో గెలిచి ఇతర పార్టీలోకి దూకి నిస్సిగ్గుగా కండువాలు కప్పించుకుంటున్న పరిస్థితి నేటి రాజకీయాల్లో కనిపిస్తుంది. ఈ సమయంలో తాను పార్టీలు మారింది ప్రజల కోసం అంటూ చెప్పుకొచ్చారు టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే!

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో రెండుసార్లూ ప్రతిపక్షాలు బలహీనంగా ఉండటంతో వార్ వన్ సైడ్ అన్నట్లుగా నాడు సమావేశాలు సాగినా... ఇప్పుడు అధికార ప్రక్షానికంటే అతితక్కువ తేడాతో ప్రతిపక్షం ఉండటంతో రసవత్తర చర్చ సాగుతుంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ అసెంబ్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యవహారం హాట్ హాట్ గా నడిచింది.

అవును... తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేదికగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... శ్వేతపత్రాలు, ప్రగతి నివేధికలు అంటూ అధికార విపక్షాల మధ్య బలమైన చర్చలు నడుస్తున్నాయి. అల్టి మేట్ గా ప్రజలకు వాస్తవాలు తెలియాలని ఈ సందర్భంగా పరిశీలకులు కోరుకుంటున్నారు. ఆ సంగైతి అలా ఉంటే... నేడు తాజాగా బీఆరెస్స్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మధ్య హోరాహోరీ మాటల యుద్ధం నడిచింది.

ఇందులో భాగంగా... రాష్ట్రంలో త్వరలోనే బీఆరెస్స్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని.. ఆ పార్టీ సభ్యులను బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేరని.. నాడు ఇతర పార్టీలలో చేరిన వారిని బీఆరెస్స్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా చేర్చుకుందని అన్నారు. ఇంతకాలం అభివృద్ధి పేరిట రూ.వేల కోట్లు దోచుకున్న చరిత్ర బీఆరెస్స్ ప్రభుత్వానిదంటూ మండిపడ్డారు. ఇదే సమయంలో... రూ.వేల కోట్ల విలువైన బంగ్లాలు మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

దీంతో మైకందుకున్న మాజీమంత్రి జగదీశ్ రెడ్డి... రాజగోపాల్‌ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే... తానెప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదని.. అది ఆ అన్నదమ్ములకే అలవాటని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా కలిపే ప్రయత్నం చేశారు! ఇదే సమయంలో... అవసరాలు, అధికారం, కాంట్రాక్టుల కోసం పార్టీ మారే వీళ్లా తన గురించి మాట్లాడేది అంటూ జగదీశ్ రెడ్డీ ఫైరయ్యారు.

ఈ సందర్భంగా అధికారం కోసం, కాంట్రాక్టుల కోసం పార్టీలు మారతారు అనే విమర్శపై రాజగోపాల్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. సమాజం మొత్తం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తేనే తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్లు తెలిపారు కోమటిరెడ్డి. తనలాంటి వ్యక్తి వాపస్ వచ్చినాడంటే మీ పని అయిపోయిందన్న విషయం మీకు అర్ధం కాలేదా అంటూ బీఆరెస్స్ నాయకులనుద్దేశించి చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా తాను కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత బీఆరెస్స్ ప్రతిపక్షంలో కూర్చుందన్న విషయం మరిచిపోవద్దని చెప్పుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... తాను పార్టీలు మారింది ప్రజలకోసం అని చెప్పడం గమనార్హం.