Begin typing your search above and press return to search.

నిన్న 92, నేడు 49.. టోటల్ కౌంట్ 141…ఎటుపోతుంది?

పార్లమెంట్ ప్రతిష్ట మసకబారుతోంది. హుందాగా ఉండాల్సిన సభ గతి తప్పుతోంది. గొడవలకే ప్రాధాన్యం ఇస్తోంది

By:  Tupaki Desk   |   19 Dec 2023 12:37 PM GMT
నిన్న 92, నేడు 49.. టోటల్ కౌంట్ 141…ఎటుపోతుంది?
X

పార్లమెంట్ ప్రతిష్ట మసకబారుతోంది. హుందాగా ఉండాల్సిన సభ గతి తప్పుతోంది. గొడవలకే ప్రాధాన్యం ఇస్తోంది. సభ్యుల ప్రవర్తన ప్రయోజనాలు ఇచ్చేదిగా ఉండాల్సినా చేటు తెస్తోంది. లోక్ సభ నుంచి 141 మంది సభ్యుల్ని సస్పెండ్ చేస్తూ బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్నచర్యలు దుమారం రేపుతున్నాయి. సభా మర్యాదలు కాపాడాల్సిన సభ్యులు స్థాయి మరిచి ప్రవర్తించడం ఆందోళనకు గురి చేస్తోంది.

ఇంత మంది ఎంపీలను సస్పెన్సన్ కు గురి చేయడం వివాదాస్పదమవుతోంది. పార్లమెంట్ లోకి అగంతకులు ప్రవేశించిన ఘటనపై ఉభయ సభలు అట్టుడికాయి. భద్రత వైఫల్యంపై ఉభయ సభల్లో సభ్యులు ఆందోళన చేపడుతున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. విపక్ష ఎంపీలను సస్పెన్షన్ పై రగడ జరుగుతోంది.

లోక్ సభ లో 33, రాజ్యసభలో 45 మందిని సస్పెండ్ చేయడంపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనిపై ప్రకటన చేయాలని మొత్తుకుంటున్నా వినిపించుకోవడం లేదు. సభా కార్యకలాపాలకు ఎంపీలు అడ్డు తగలడంతో వారిని సభ నుంచి బహిష్కరించారు. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తున్నారు. ఇంత మంది ఎంపీలను బహిష్కరించడం పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి అని చెబుతున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. నిన్న 92 నేడు 41 టోటల్ 141 సభ్యుల సస్పెన్షన్ కొనసాగుతోంది. దీంతో పార్లమెంట్ ప్రతిష్ట ఎటు వైపు పోతోందనే చర్చలు వస్తున్నాయి.

సస్పెండైన సభ్యుల్లో వైతిలింగం, గుర్జీత్ సింగ్ ఔజ్లూ, సుప్రియ సూలే. సప్తగిరి శంకర్ ఉలక, అదూర్ ప్రకాష్, అబ్దుల్సమద్, మనీష్ తివారి, ప్రద్యుత్ బోర్డోలోయ్, గిర్దారి యాదవ్, గీతా కొడా, ఫఠాన్ , జగత్రక్షకన్, ఎస్ఆర్ పార్థిబన్, ఫరూక్ అబ్దుల్లా, జ్యోత్స్స మహంత్, గణేశ మూర్తి, మాలా రాయ్, వేలు సామి, చందర్ కుమార్, శశి ధరూర్, సుదీప్ బంధ్యోపాధ్యాయ, డింపుల్ యాదవ్, హస్సైన్ మసూది, డానిష్ అల, ఖలీలుర్ రెహమాన్ ఉన్నారు.

పార్లమెంట్ పై 2001 డిసెంబర్ 13న కూడా దాడి జరిగింది. దేశ అత్యున్నత స్థానం అయిన పార్లమెంట్ కే భద్రత లేకపోతే ఎలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. సభ్యులు పార్లమెంట్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సభలోకి అగంతకులు ప్రవేశించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న భద్రత చర్యలు ఇవేనా అని ప్రశ్నిస్తున్నారు.

పార్లమెంట్ భద్రతపై ఇంత డొల్లతనంగా ఉంటే భవిష్యత్ లో మరిన్ని దాడులు జరిగే అవకాశముంది. బీజేపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. దీంతో సభ్యుల సస్పెన్షన్ సందేహాలకు తావిస్తోంది. ఈనేపథ్యంలో పార్లమెంట్ రక్షణ గాలికొదిలేశారనే వాదనలు పెరుగుతున్నాయి.