Begin typing your search above and press return to search.

పార్లమెంట్ పై దాడి సూత్రధారి చెప్పిన షాకింగ్ నిజాలు!

ఒకవేళ ఈ ఇద్దరు పార్లమెంట్ లోపలికి ప్రవేశించలేకపోతే మరోవైపు నుంచి మహేష్, కైలాష్ ప్రవేశించి గలాటా చేయాలని నిర్ణయించుకున్నట్టుగా వెల్లడించాడు.

By:  Tupaki Desk   |   15 Dec 2023 3:05 PM GMT
పార్లమెంట్ పై దాడి సూత్రధారి చెప్పిన షాకింగ్ నిజాలు!
X

పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా కొందరు ఆగంతకులు పార్లమెంటులోకి జొరబడి టియర్ గ్యాస్ వదిలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. విజిటర్స్ గ్యాలరీలో నుంచి దూకి లోక్ సభలోకి ప్రవేశించిన సాగర్ శర్మ, మనోరంజన్‌ టియర్ గ్యాస్ రిలీజ్ చేసి సభలో గందరగోళం సృష్టించారు. భవనం వెలుపల నినాదాలు చేసిన నీలమ్ దేవి, అమోల్ షిండేలతో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే విచారణ సందర్భంగా వారు విస్తుపోయే నిజాలు వెల్లడించారు. టియర్ గ్యాస్ రిలీజ్ చేయాలని ప్లాన్ ఏ వేశామని, ఒకవేళ వారు ఫెయిల్ అయితే ప్లాన్ బి కూడా ఉందని లలిత్ అనే నిందితుడు చెప్పాడు. ఒకవేళ ఈ ఇద్దరు పార్లమెంట్ లోపలికి ప్రవేశించలేకపోతే మరోవైపు నుంచి మహేష్, కైలాష్ ప్రవేశించి గలాటా చేయాలని నిర్ణయించుకున్నట్టుగా వెల్లడించాడు. అయితే తాము నివాసం ఉంటున్న విశాల్ ఇంటికి చేరుకోవడంలో మహేష్, కైలాష్ విఫలమైనందున ఎలాగైనా అమోల్ , నీలంలను పని పూర్తి చేయాలని ఆదేశించినట్టు చెప్పారు.

ఈ క్రమంలోనే ఈ ఏడుగురు నిందితులపై దేశ వ్యతిరేక కార్యకలాపాల చట్టం ఉపా కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనకు సూత్రధారి లలిత్ కోల్‌కతా నగరంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడని తేలింది. లోక్ సభలో గ్యాస్ రిలీజ్ చేసిన వీడియోలను లలిత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఇక, నిందితులను ప్రశ్నించేందుకు 2 వారాలపాటు కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు అధికారులు కోరారు. కోర్టు ఒక వారం సమయం ఇచ్చింది. ఈ ఘటన వెనుక ఉగ్రవాద సంస్థ ఏదీ లేదని దర్యాప్తు అధికారులు అనధికారికంగా చెబుతున్నట్టు తెలుస్తోంది.