అదే పనిగా పారాసిటమాల్ వాడుతున్నారా? ఇది చదవాల్సిందే
ఇటీవల కాలంలో లివర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు భారీగా జరుగుతున్నాయి. ప్రతి వందలో 30 మంది వరకు మద్యం తాగే వారు కావటం గమనార్హం.
By: Tupaki Desk | 31 Aug 2025 11:00 AM ISTకాస్తంత జ్వరం వస్తే మరో ఆలోచన లేకుండా పారాసిటమాల్ మాత్రల్ని వాడుతుంటాం. అంతేనా..ఒళ్లు నొప్పులతో పాటు పలు ఆరోగ్య సమస్యలకు వాడే అతి ముఖ్యమైన మందుల్లో పారాసిటమాల్ మాత్ర పక్కగా ఉంటుంది. అయితే.. ఎక్కువగా పారాసిటమాల్ వాడితే కాలేయానికి నష్టం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అంతేకాదు.. టీబీ మందులు వాడే వారు సైతం జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
ఇటీవల కాలంలో లివర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు భారీగా జరుగుతున్నాయి. ప్రతి వందలో 30 మంది వరకు మద్యం తాగే వారు కావటం గమనార్హం. మిగిలిన 30 మంది ఫ్యాటీ లివర్ కారణంగా వస్తున్నారు. ఇంతకూ ఈ ఫ్యాటీ లిటర్ ఎందుకు? అంటే.. ఫాస్ట్ ఫుడ్.. అధిక నూనె.. వేపుళ్ల ఆహారంతో పాటు కదలకుండా ఒకే చోట కూర్చొని పని చేస్తుండటంతో లివర్ లో కొవ్వు చేరి.. అనారోగ్యానికి గురి చేస్తోంది.
సరైన వ్యాయామం లేని కారణంగా కాలేయం దెబ్బ తింటోందని.. షుగర్.. అధిక బరువు కారణంగా కాలేయం దెబ్బ తింటోందని వైద్యులు చెబుతున్నారు. ఘగర్.. అధిక బరువు సమస్యలు ఉన్న వారు ఏటా ఒకసారి లివర్ టెస్టు చేసుకోవటం తప్పనిసరి అని చెబుతున్నారు. కొవ్వు.. అతిగా వేయించిన ఆహారాలను చాలా తగ్గించాలని.. పండ్లు.. ఆకుకూరలు.. ప్రోటీన్ పదార్థాలు ఎక్కువగా తినాలని చెబుతున్నారు.
వారానికి 151 నిమిషాలు వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. లివర్ దెబ్బ తినటం వల్ల గుండె కండరాలు బలహీనపడతాయని వైద్యులు చెబుతున్నారు. గుండె సమస్య ఉంటే కాలేయంలో నీరు చేరి సిరోసిస్ కు దారి తీస్తుందని.. మధుమేహం.. అధిక కొవ్వు కంటే మెటబాలిక్ సిండ్రోడ్ కు దారితీసి లివర్.. గుండె రెండూ దెబ్బ తింటాయిని వైద్యులు చెబుతున్నారు.
