Begin typing your search above and press return to search.

పల్లవి ప్రశాంత్ కేసులో పోలీసుల దూకుడు... లెక్క పెరిగింది!

ప్రముఖ రియాల్టీ షో బిగ్‌ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్‌ ను పోలీసులు చంచల్ గూడ జైలుకు పంపించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 Dec 2023 10:53 AM GMT
పల్లవి ప్రశాంత్  కేసులో పోలీసుల దూకుడు... లెక్క పెరిగింది!
X

ప్రముఖ రియాల్టీ షో బిగ్‌ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్‌ ను పోలీసులు చంచల్ గూడ జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులో ఏ1, ఏ2 నిందితులుగా పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు మనోహర్‌ ను బుధవారం రాత్రి వారి స్వగ్రామం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం కొల్గూరులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో అరెస్టైన వారి లెక్క భారీగా పెరిగిందని తెలుస్తుంది.

అవును... ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులో ఏ1, ఏ2 లుగా ఉన్న పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు మనోహర్‌ ను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. వారిని న్యాయమూర్తి ఎదుట హాజరపరిచారు. దీంతో ఇద్దరికీ 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో ప్రశాంత్‌ తో పాటు అతని సోదురుడిని చంచల్‌ గూడ జైలుకు తరలించారు. ఈ సమయంలో వీరితో పాటు ఈ కేసులో మరో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ స్టూడియోస్, కృష్ణానగర్ అన్నపూర్ణా స్టూడియోస్ బస్ స్టాప్ వద్ద బిగ్ బాస్ సీజన్ - 7 తెలుగు విజేత పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన రచ్చ కేసులో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుల కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. బస్సులపై దాడీ జరిగిన వెంటనే టీఎస్ ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ సమయంలో తొలుత ఈ కేసులో ఏ1 గా ఉన్న పల్లవి ప్రశాంత్ ని, ఏ2 గా ఉన్న మనోహర్ ని అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు మరో 16 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో నలుగురు మైనర్లు కూడా ఉన్నారని చెబుతున్నారు. దీంతో... ఈ 16 మందిలో మేజర్లుగా ఉన్న 14 మందిని నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు, నలుగురు మైనర్లనూ జువైనల్ జస్టీస్ బోర్డు ఎదుట హాజరుపరచనున్నారు.

కాగా.. పల్లవి ప్రశాంత్ పై మొత్తం 9 సెక్షన్ ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో నిన్నటివరకూ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ప్రశాంత్ ఇప్పుడు చంచల్ గూడ జైల్లో ఉన్నాడు. బిగ్ బాస్ విన్నర్ ప్రకటన అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన అల్లర్లకు కారకుడయ్యాడనే కేసులో పోలీసులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో వీరితోపాటు మరో 16మందిని అరెస్ట్ చేశారు.

ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్‌, ఎ-2గా అతడి సోదరుడు మనోహర్‌, ఎ-3గా అతడి స్నేహితుడు వినయ్‌ ను చేర్చిన పోలీసులు... ఎ-4గా ఉప్పల్‌ మేడిపల్లికి చెందిన లాంగ్‌ డ్రైవ్‌ కార్స్‌ లో డ్రైవర్లుగా పనిచేస్తున్న సాయికిరణ్‌ (25), అంకిరావుపల్లి రాజు (23) చేర్చారు.