Begin typing your search above and press return to search.

స‌రిగ్గా 80 ఏళ్ల కింద‌ట‌.. ఇదిగో ‘పాల‌స్తీనా దేశం’ ఇలా ఉండేది

రెండో ప్ర‌పంచ యుద్ధం ప్ర‌పంచం ఆలోచ‌న‌నే కాదు.. ప్ర‌పంచ ప‌టాన్నే మార్చేసింది. ప‌రోక్షంగా భారత దేశానికి బ్రిట‌న్ పాల‌న నుంచి విముక్తి క‌ల్పించింది.

By:  Tupaki Desk   |   24 Sept 2025 9:52 AM IST
స‌రిగ్గా 80 ఏళ్ల కింద‌ట‌.. ఇదిగో ‘పాల‌స్తీనా దేశం’ ఇలా ఉండేది
X

ఇప్పుడు ప్ర‌పంచంలో ఒక హాట్ టాపిక్.. అది ‘పాల‌స్తీనా దేశం గుర్తింపు’.. ఈ విష‌యంలో బ్రిట‌న్ తాజాగా చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యం తీసుకుంది. దీంతోపాటు కెన‌డా, ఆస్ట్రేలియా కూడా పాల‌స్తీనాను దేశంగా గుర్తించాయి. ఫ్రాన్స్ స‌హా మ‌రికొన్ని దేశాలు కూడా ఇదే బాట‌లో ఉన్నాయి. పెద్ద‌న్న అమెరికాకు షాక్ ఇస్తూ వాటి మిత్ర‌దేశాలు ఈ విధంగా నిర్ణ‌యించ‌డం పెద్ద విష‌య‌మే. మ‌రి అస‌లు ఏమిటీ ‘పాల‌స్తీనా దేశం’ అని చూస్తే చాలా ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

రెండో ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత‌

రెండో ప్ర‌పంచ యుద్ధం ప్ర‌పంచం ఆలోచ‌న‌నే కాదు.. ప్ర‌పంచ ప‌టాన్నే మార్చేసింది. ప‌రోక్షంగా భారత దేశానికి బ్రిట‌న్ పాల‌న నుంచి విముక్తి క‌ల్పించింది. 1935 నుంచి 1945 వ‌ర‌కు సాగిన ఈ రెండో ప్ర‌పంచ యుద్ధంలో అమెరికా, సోవియ‌ట్ యూనియ‌న్ (నేటి రష్యా), బ్రిట‌న్, ఫ్రాన్స్ వంటి కీల‌క దేశాలు మిత్ర రాజ్యాలుగా.. జ‌ర్మ‌నీ, ఇట‌లీ, జ‌పాన్ అక్ష రాజ్యాలుగా త‌ల‌ప‌డ్డాయి. జ‌ర్మ‌నీ నియంత అడాల్ఫ్ హిట్ల‌ర్ పోలండ్ దేశంపై దాడి చేయ‌డంతో ఈ యుద్ధం మొద‌లైంది. జ‌పాన్ పై అమెరికా అణుబాంబు దాడి.. ఓట‌మిని గ్ర‌హించిన హిట్ల‌ర్ ఆత్మ‌హ‌త్య‌తో ముగిసింది.

హిట్ల‌ర్ న‌ర‌మేధంతో...

జ‌ర్మ‌నీకి తిరుగులేని నియంత‌గా.. త‌న ప్ర‌సంగాల‌తో ప్ర‌జ‌ల‌ను అత్యంత ప్ర‌భావితం చేశాడు హిట్ల‌ర్. అంతేకాదు.. చ‌రిత్ర‌లో ఎరుగని మార‌ణ‌హోమానికి పాల్ప‌డ్డాడు. యూదుల ప‌ట్ల విప‌రీత‌మైన ద్వేషంతో వారి జాతిని అంతం చేయాల‌ని పూనుకున్నాడు. కాన్స‌న్ట్రేష‌న్ క్యాంపు లు పెట్టి ల‌క్ష‌ల మంది యూదుల‌ను చంపించాడు. ఈ అణ‌చివేత‌తో యూదులు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. త‌మ‌కు సొంతం దేశం లేక‌పోవ‌డంతోనే ఇదంతా జ‌రుగుతుంద‌ని గ్ర‌హించి.. శ‌తాబ్దాల కింద‌ట త‌మ‌కు అనుబంధం ఉన్న త‌మ నేల‌ను వెదుక్కుంటూ వ‌చ్చారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న యూదులంతా ఇలా ఒకచోట‌కు చేరారు. అదే ఇజ్రాయెల్. 108 ఏళ్ల కింద‌ట‌.. 1917లో ఈ దేశాన్ని బ్రిట‌న్ గుర్తించ‌డం గ‌మ‌నార్హం.

అస‌లు అప్ప‌ట్లో పాల‌స్తీనా...

ప్ర‌స్తుతం ఇజ్రాయెల్ గా చెప్పుకొంటున్న ప్రాంతంతో పాటు గాజా, వెస్ట్ బ్యాంక్ లు కూడా పాల‌స్తీనా పేరిట‌ 1917 నాటికి బ్రిట‌న్ పాల‌న‌లోనే ఉన్నాయి. అయితే ఆ ఏడాది ఇజ్రాయెల్ దేశాన్ని గుర్తిస్తూ బెల్ఫోర్స్ డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించింది. ఇక్క‌డే అస‌లు వివాదానికి విత్త‌నం ప‌డింద‌ని చెప్పాలి. క్ర‌మంగా రెండో ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత‌ యూదులంతా ఇజ్రాయెల్ చేరుకున్నారు.

మ్యాప్ ల‌లో స్ప‌ష్టంగా చూస్తే...

యూదులు అత్యంత తెలివిగ‌ల వారు. త‌మ అద్భుత‌ మేధ‌స్సుతో ప్ర‌పంచాన్నే ప్ర‌భావితం చేయ‌గ‌ల‌వారు. ఇలానే ఇజ్రాయెల్ ను ఓ దేశంగా చేసుకుని ఊహించ‌ని విధంగా డెవ‌ల‌ప్ చేశారు. అయితే, అప్ప‌టికే పాల‌స్తీనా పేరిట అర‌బ్బుల ఆధిప‌త్యం ఉన్న దేశం ఉంది. కాల‌క్ర‌మంలో పాల‌స్తీనా-ఇజ్రాయెల్ సంఘ‌ర్ష‌ణ కాస్త జాతి వైరానికి, యుద్ధాల‌కు దారితీసింది.

-పాల‌స్తీనా అనే దేశం కాస్త ఇజ్రాయెల్ దూకుడు ముందు క్ర‌మంగా కుంచించుకు పోయింది. 1940ల నుంచి కొద్దికొద్దిగా ఇజ్రాయెల్ విస్త‌రించ‌గా.. పాల‌స్తీనా అనేది గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల‌కే ప‌రిమితం అయిన‌ట్లు స్ప‌ష్టం అవుతుంది. ఇక గాజా కూడా పూర్తిగా హ‌మాస్ మిలిటెంట్ సంస్థ ఆధిప‌త్యంలో ఉంది. 2007 నుంచి గాజాను హ‌మాస్ ప్ర‌భుత్వ‌మే పాలిస్తోంది. ఇక వెస్ట్ బ్యాంక్ లోనూ ఇజ్రాయెల్ సెటిల్మెంట్లు ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్ లో వేరే పాల‌నా వ్య‌వ‌స్థ ఉండ‌డం గ‌మ‌నార్హం.

ద్విదేశ ప‌రిష్కారానికి భార‌త్ ఓటు

ఇజ్రాయెల్ చిన్న దేశం అంటే.. అందులో పాల‌స్తీనా ఇంకా చిన్న‌ది. ఇప్పుడ‌ది గాజా, వెస్ట్ బ్యాంక్ కు ప‌రిమితం అయింది. అయితే, ఇజ్రాయెల్- పాల‌స్తీనా అనే ద్విదేశ (టు స్టేట్స్) విధానాన్ని భార‌త్ 1980ల చివ‌ర్లోనే గుర్తించింది.

మ‌న‌తో పాటు ర‌ష్యా, చైనా త‌దిత‌ర‌ 147 దేశాలు కూడా పాలస్తీనాకు గుర్తింపునిచ్చాయి. ఇప్పుడు బ్రిట‌న్ స‌హా మ‌రికొన్ని దేశాలు కూడా ముందుకురావ‌డంతో 150 పైగా దేశాల మ‌ద్ద‌తు ఉన్న‌ట్ల‌యింది.

-ఐక్య‌రాజ్య స‌మితి లెక్క‌ల ప్ర‌కారం మొత్తం దేశాల సంఖ్య 195. మ‌రో మూడు అబ్జ‌ర్వ‌ర్ స్టేట్స్ (దేశాలు. అవి పాల‌స్తీనా, వాటిక‌న్ సిటీ, కొసావో.