Begin typing your search above and press return to search.

పాలమూరు సభ బలప్రదర్శనేనా ?

ఈనెల 16వ తేదీన బీఆర్ఎస్ నిర్వహించబోతున్న బహిరంగసభను ఒకరకంగా బలప్రదర్శనగానే అనుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   11 Sep 2023 4:17 AM GMT
పాలమూరు సభ బలప్రదర్శనేనా ?
X

ఈనెల 16వ తేదీన బీఆర్ఎస్ నిర్వహించబోతున్న బహిరంగసభను ఒకరకంగా బలప్రదర్శనగానే అనుకుంటున్నారు. ఎన్నికలకు ముందు పాలమూరులో భారీ బహిరంగసభను నిర్వహించాలని కేసీయార్ గట్టిగా అనుకుంటున్నారు. ఈ సభ నిర్వహణను కేసీయార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈనెల 17వ తేదీన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోనియాగాంధి, బీజేపీ నాయకత్వంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణా విమోచన దినోత్సవాన్ని పెద్దఎత్తున జరపబోతున్నాయి.

తెలంగాణా విమోచన దినోత్సవం అంటేనే ప్రస్తుత కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకమని చెప్పక్కర్లేదు. పై రెండుపార్టీలు ఎలాగూ తెలంగాణా విమోచన దినోత్సవాన్ని భారీ ఎత్తున బహిరంగసభలు జరుగుతున్నాయి కాబట్టి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా భారీ బహిరంగసభ నిర్వహించాలని కేసీయార్ డిసైడ్ చేశారు. తక్కువలో తక్కువ లక్షన్నరమంది జనాలు హాజరు అవ్వాలని ఆదేశాలిచ్చారు.

జనసమీకరణకు ఎంఎల్ఏలకు ఎంఎల్ఏ అభ్యర్ధులు, నేతలకు కేసీయార్ స్పష్టమైన ఆదేశాలిచ్చారట. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసిన పద్దతిలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కూడా పూర్తిచేస్తానని కేసీయార్ హామీ ఇవ్వబోతున్నట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల సాగునీటి, తాగునీటి అవసరాలు తీరుతాయి. కాంగ్రెస్, బీజేపీలు నిర్వహించబోయే బహిరంగసభకు ధీటుగా జనసమీకరణ జరగాల్సిందే అని కేసీయార్ పట్టుదలగా ఉన్నారు. విచిత్రం ఏమిటంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను ఇరిగేషన్ శాఖ నిర్వహిస్తోంది. అంటే ప్రభుత్వ ఖర్చుతోనే కేసీయార్ షోకులు చేయబోతున్నట్లు అర్ధమవుతోంది.

తొందరలో జరగబోయే పాలమూరు బహిరంగసభకు సంబంధించి మంత్రి కేటీయార్ సమీక్ష నిర్వహించారు. జనసమీకరణకు సంబంధించే కేటీయార్ ప్రధానంగా ప్రస్తావించారు. ఈ విషయంలో మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలందరు విధిగా భాగస్వాములు అవ్వాల్సిందే అని కేటీయార్ పదేపదే చెప్పారు. జనసమీకరణపైనే ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ ప్రతిష్ట ఆధారపడుందన్నది అందరికీ తెలిసిందే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీయార్ ప్రకటించిన ఎంఎల్ఏ అభ్యర్ధులపై ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోతోంది. అలాగే మామూలు జనాల్లో కూడా వ్యతిరేకత స్పష్టంగా కనబడుతోంది. ఇలాంటి నేపధ్యంలో బహిరంగసభ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కేసీయార్ పట్టుదల ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి.