Begin typing your search above and press return to search.

పాక్ శ్రీరంగ నీతులు... ఇరాన్ కు హెచ్చరికలు!

ఇందులో భాగంగా... తమ భూభాగంలోని తీవ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడి చేసినట్లు ఇరాన్‌ చేసిన ప్రకటనను పాకిస్థాన్‌ తీవ్రంగా ఖండించింది.

By:  Tupaki Desk   |   17 Jan 2024 11:45 AM GMT
పాక్  శ్రీరంగ నీతులు... ఇరాన్  కు హెచ్చరికలు!
X

గతకొన్ని రోజులుగా గూఢచార స్థావరాలు, ఉగ్రవాద సంస్థలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరాక్‌ లోని కుర్దిస్థాన్‌ ప్రాంతంపై దాడులు చేసినట్లు ఇరాన్‌ రెవల్యూనరీ గార్డ్స్‌ ప్రకటించింది. ఇదే సమయంలో సిరియాలోని ఉగ్రవాద సంస్థ శిబిరాలను సైతం ధ్వంసం చేసినట్లు చెప్పింది. ఈ సమయంలో తాజాగా పాక్ పైనా ఇరాన్ దాడులు చేసింది.

అవును... ఉగ్రవాదులే లక్ష్యంగా వరుసపెట్టి దాదులు చేస్తున్న ఇరాన్.. ఇందులో భాగంగా పాక్ పైనా దాడులు చేసింది. ఇందులో భాగంగా పాకిస్థాన్‌ లోని బలూచిస్థాన్‌ ప్రాంతంలో తీవ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ క్రమంలో "జైష్‌ అల్‌ అదిల్‌" కు చెందిన రెండు ప్రధాన కార్యాలయాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడిందని తెలుస్తుంది. దీంతో ఈ విషయాలపై పాక్ స్పందించింది.

ఇందులో భాగంగా... తమ భూభాగంలోని తీవ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడి చేసినట్లు ఇరాన్‌ చేసిన ప్రకటనను పాకిస్థాన్‌ తీవ్రంగా ఖండించింది. ఇదే సమయంలో... ఇటువంటి చర్యలకు తీవ్రమైన పరిణామాలుంటాయని హెచ్చరించింది. ఈ దాడుల్లో ఇద్దరు పిల్లలు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇరాన్‌ చర్యలను ఖండిస్తూ ఆ దేశ రాయబారిని పిలుపించుకొని పాక్ తమ నిరసనను తెలియజేసింది. ఇందులో భాగంగా... తమ గగనతలాన్ని దుర్వినియోగం చేస్తూ.. దేశ సౌర్వభౌమాధికారాన్నే సవాల్‌ చేశారని పేర్కొంది. ఇదే సమయంలో... సరిగ్గా దాడులు ఎక్కడ జరిగాయనే విషయాన్ని మాత్రం వెల్లడించని పాక్... ఉగ్రవాదంపై సన్నాయినొక్కులు నొక్కింది!

ఇందులో భాగంగా... ఉగ్రవాదం అన్ని దేశాలకూ తీవ్ర ముప్పు తలపెడుతుందని.. దీన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చింది. అయితే... ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం పొరుగు దేశాల మధ్య సత్సంబంధాలను ప్రతిబింబించదని.. ద్వైపాక్షిక బంధాన్ని తీవ్రంగా దెబ్బతీసేలా మీ చర్యలున్నాయంటూ ఇరాన్‌ పై మండిపడింది.

కాగా పాకిస్థాన్ లోని బలూచిస్థాన్‌ ప్రాంతంలో తీవ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామని ఇరాన్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా... "జైష్‌ అల్‌ అదిల్‌" ఉగ్రసంస్థకు చెందిన రెండు ప్రధాన కార్యాలయాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడినట్లు వెల్లడించింది. వాస్తవంగా... పాకిస్థాన్‌ కేంద్రంగా పని చేస్తూ ఇరాన్‌ లో ఈ "జైష్‌ అల్‌ అదిల్‌" సున్నీ మిలిటెంట్‌ గ్రూపు కార్యకలాపాలను నిర్వహిస్తోంది.