Begin typing your search above and press return to search.

దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది... పాక్ ప్రెసిడెంట్ కీలక నిర్ణయం!

ఈ సమయంలో ఇటీవల పాక్ లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో పాక్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఆసీఫ్ అలీ జర్దారీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   13 March 2024 12:30 PM GMT
దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది... పాక్  ప్రెసిడెంట్  కీలక నిర్ణయం!
X

ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్ధిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందనే సంగతి తెలిసిందే! అక్కడ ఆర్థిక మాద్యం కారణంగా కోడిగుడ్డు నుంచి పెట్రోల్ వరకూ ధరలు కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిపోయాయి.. సామాన్యుడికి అందుబాటులో లేని స్థితికి చేరుకున్నాయని తెలుస్తుంది. ఈ సమయంలో ఇటీవల పాక్ లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో పాక్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఆసీఫ్ అలీ జర్దారీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.

అవును... దేశం చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది అనే మాటను ఇప్పుడు పాక్ నేతలు బలంగా చెబుతున్నారు. అందుకోసం వారు చేపట్టబోయే చర్యలు ఏమిటి.. తీసుకోబోయే నిర్ణయాలు ఏమిటి.. దేశాన్ని గట్టెంకించడానికి ఎంచుకోబోయే మార్గాలు ఏమిటి అనే సంగతి కాసేపు పక్కనపెడితే... ప్రస్తుతానికి మాత్రం ప్రధానిగా తనకు వచ్చే జీతాన్ని తీసుకోకూడదని నిర్ణయించుకున్నారంట. ఈ మేరకు అధ్యక్ష కార్యాలయం ఎక్స్ వేదికగా ఈ విషయాలను వెల్లడించింది.

ఇందులో భాగంగా... దేశంలో ఆర్థిక వ్యవస్థను, నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చాలన్నదే అధ్యక్షుడి నిర్ణయం వెనుక ఉద్దేశ్యమని.. దేశ ఖజానాపై తన జీతం భారం కాకూడదనే ఆయన నిర్ణయించుకున్నారని. అందుకే జీతం తీసుకోకూడదని అనుకున్నారని ట్విట్టర్ లో తెలిపారు. ఇదే సమయంలో పలువురు మంత్రులు కూడా ఈ దిశగా ఆలోచన చేస్తున్నారని.. వారు కూడా తమ తమ జీతాలు వదులుకునేందుకు సిద్ధపడుతున్నారని తెలుస్తుంది.

ఇందులో భాగంగా... పాకిస్థాన్ ఇంటీరియర్ మంత్రి మొహసిన్ నక్వీ కూడా ఈ పదవీకాలంలో జీతాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై స్పందించిన ఆమె... ఇది సవాళ్లతో కూడుకున్న సమయం, వీలైనన్ని మార్గాల్లో దేశానికి అండగా ఉండి సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.