ఈసీకి షాక్: బీహార్‌లో ఇద్దరు పాక్ పౌరులకు ఓటు హక్కు!
`ఓట్ అధికార్ యాత్ర` పేరుతో 13 వేల కిలో మీటర్లు, 22 జిల్లాల్లో కవర్ చేసేలా యాత్రను ప్రస్తుతం కొనసా గిస్తున్నారు.
By: Tupaki Desk | 24 Aug 2025 4:36 PM ISTకేంద్ర ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీలు నిప్పులు చెరు గుతున్న విషయం తెలిసిందే. బతికి ఉన్నవారి ఓట్లు తీసేస్తున్నారని, చచ్చిపోయిన వారి ఓట్లు ఉంచుతు న్నారని.. ఒకే వ్యక్తికి నాలుగు చోట్ల ఎన్నికల గుర్తింపు కార్డులు ఇచ్చారని, `జీరో` డోర్ నెంబరుతో వేలాది ఓట్లు ఇచ్చారని ఇలా.. అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. అంతేకాదు.. బీహార్‌లో అయితే.. 65 లక్షల ఓట్లను తొలగించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెద్ద ఉద్యమమే చేస్తున్నారు.
`ఓట్ అధికార్ యాత్ర` పేరుతో 13 వేల కిలో మీటర్లు, 22 జిల్లాల్లో కవర్ చేసేలా యాత్రను ప్రస్తుతం కొనసా గిస్తున్నారు. ఓట్లను చోరీ చేస్తున్నారని, తమకు అనుకూలంగా ఉన్నవారిని చేరుస్తూ.. కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి పార్టీలకు అనుకూలంగా ఉన్నారని భావిస్తున్న ఓటర్లను తొలగిస్తున్నారని రాహుల్‌గాం ధీ సహా ఇతర పక్షాల నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. అయితే.. దీనికి సమాధానం చెప్పని ఎన్నిక ల సంఘం.. ఎదురు ఆరోపణలు సంధించింది.. అఫిడవిట్లు కోరింది. కుదరకపోతే.. క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా బీహార్‌లో సంచలన విషయం వెలుగు చూసింది. ఇద్దరు పాకిస్థాన్ పౌరులకు ఇక్కడ ఓటు హక్కు కల్పించారు. పోనీ.. వారేమన్నా.. పాక్ వదిలేసి వచ్చి ఉంటున్నారా? అంటే.. లేదు. ఒకరు 3 మాసాల వీసాపై 1956లో వచ్చి దొంగచాటుగా ఇక్కడే ఉంటున్నారు. మరొకరు మూడేళ్ల వీసాపై వైద్యం కోసం ఇటీవల వచ్చారు. కానీ, వీరి వివరాలు పరిశీలించకుండానే గుడ్డిగా ఎన్నికల సంఘం వీరికి ఓటు హక్కు కల్పించింది. తాజాగా ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వెలుగు చూడగానే కేంద్ర హోం శాఖ హుటాహుటిన స్పందించింది.
ఏం జరిగింది?
పాకిస్థాన్‌కు చెందిన మహిళలు.. ఇమ్రానా ఖానమ్ అలియాస్ ఇమ్రానా ఖాటూన్, మరొకరు ఫిర్దోషియా ఖానమ్ అనే మహిళలకు తాజాగా ఓటరు కార్డులు ఇచ్చారు. వీటిపై చుట్టుపక్కలవారికి అనుమానం వచ్చి.. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇవి జోరుగా వైరల్ అయ్యాయి. వెంటనే స్పందించిన కేంద్ర హోంశాఖ విచారణ చేపట్టింది. ఫిర్దోషియా 1956లో మూడు నెలల వీసాపై, ఇమ్రానా మూడేళ్ల వీసాపై భారత్‌కు వచ్చి..భాగల్పూర్ జిల్లాలోని భికన్‌పూర్‌లో స్థిరపడ్డారని గుర్తించింది. వెంటనే వీరి ఓట్లను తొలగించాలని ఆదేశించింది. దీనిపై ఎన్నికల సంఘం ఎప్పటిలానే మౌనంగా ఉండిపోయింది.
