షాకింగ్ వీడియో... ఈ పాకిస్థానీకి భారత్ లో ఆధార్ తప్ప అన్నీ ఉన్నాయి!
దేశం విడిచి వెళ్తున్న ఓ పాకిస్తానీ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
By: Tupaki Desk | 30 April 2025 9:54 PM ISTజమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు దౌత్య పరమైన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... పాకిస్థాన్ వీసాలను రద్దు చేసింది. దీంతో... దేశం విడిచి వెళ్తున్న ఓ పాకిస్తానీ వ్యక్తికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ సందర్భంగా అతడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
అవును... దేశం విడిచి వెళ్తున్న ఓ పాకిస్తానీ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాను సుమారు గత 17 ఏళ్లుగా భారత్ లోనే నివాసం ఉంటున్నానని.. ఇక్కడ తనకు రేషన్ కార్డు ఉందని, ఎన్నికల్లో తాను ఓటు కూడా వేశానని చెబుతున్నాడు! దీంతో... ఓ పాకిస్తానీ పౌరుడికి భారత్ లో ఇవి ఎలా సాధ్యం అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఆ వీడియోలోని వ్యక్తి తనను తాను ఉసామాగా పరిచయం చేసుకున్నాడు. ఈ సందర్భంగా తాను భారత్ లోనే స్కూలు విద్యను పూర్తి చేసి, ప్రస్తుతం డిగ్రీ చేస్తున్నట్లు చెప్పాడు. తాను గత 17 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాన్ని.. తాను భారత్ లో ఓటు కూడా వేశానని, తనకు ఇక్కడ రేషన్ కార్డు కూడా ఉందని, తనకు మరికొంత సమయం ఇవ్వాలని కోరుతున్నాడు!
ఇదే సమయంలో... పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండించిన ఉసామా.. ఎటువంటి భవిష్యత్తు లేని పాకిస్థాన్ కు తనను ఎందుకు పంపుతున్నారని ఎదురు ప్రశ్నించాడు! ఇలా భారత్ లో వలస ఉంటున్న ఓ పాకిస్థాన్ పౌరుడు.. ఇక్కడ ఓటు వేయడం, రేషన్ కార్డు కలిగి ఉండటం భద్రతా పరమైన అంశాలపై తీవ్ర ఆందోళనలు పెంచుతోందని అంటున్నారు.
ఒక విదేశీయుడు.. అందునా నిత్యం భారత్ చెడు కోరుకునే శత్రు దేశమైన పాకిస్థాన్ కు చెందిన వ్యక్తి.. భారత్ లో ఇన్ని హక్కులు ఎలా సంపాదించాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై భారత ప్రభుత్వం తక్షణం సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం పుష్కలంగా ఉందని పలువురు సూచిస్తున్నారు.
కాగా... ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసారన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలోనే పలు దౌత్యపరమైన చర్యలకు ఉపక్రమిస్తూ.. పాక్ వీసాలు రద్దు చేసి, అట్టారీ సరిహద్దును మూసివేసింది. ఈ సమయంలో భారత్ నుంచి పాక్ వెళ్తున్న వ్యక్తి చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి!
