Begin typing your search above and press return to search.

పాక్ కు మరో చావు దెబ్బ... 20 మంది సైనికులు హతం!

భారత్ - పాకిస్థాన్ మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 May 2025 3:07 PM IST
పాక్  కు మరో చావు దెబ్బ... 20 మంది సైనికులు హతం!
X

భారత్ - పాకిస్థాన్ మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తమపై దాడి చేసేందుకు పాకిస్థాన్ చేసిన ప్రయత్నాలను భారత్ బలంగా తిప్పి కొట్టింది. పాక్ కు చెందిన ఒక్క మిస్సైల్ కానీ, డ్రోన్ కానీ, ఫైటర్ జెట్ కానీ భారత్ లో ఎలాంటి భారీ నష్టాన్ని కలిగించకుండా భారత రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి.

అయితే... పాక్ రక్షణ వ్యవస్థలకే రక్షణ లేని పరిస్థితుల్లో వాటి సంగతి చూసిన భారత్... పాక్ గుండెగా చెప్పే లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, కారాచీలలో దాడులకు పాల్పడినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఇస్లామాబాద్ లో పేలుళ్ల శబ్ధాలకు పాక్ ప్రధాని సేఫ్ హౌస్ కు జారుకున్నారని అంటున్నారు. ఈ సమయంలో పాక్ కు మరో దెబ్బ తగిలింది.

వాస్తవానికి పాక్ కు భారత్ సైన్యం గ్యాప్ ఇవ్వడం లేదు. వరుస దాడులతో ముచ్చెమటలు పట్టించేసుంది. మరోపక్క అదను చూసి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాక్ సైన్యాన్ని ఆడేసుకుంటుంది. ఈ సమయంలో.. బలూచిస్తాన్ లోని కచ్చి జిల్లాలో 14 మంది పాకిస్థాన్ ఆర్మీ సైనికులను తమ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) ఢీకొనడంతో మరణించినట్లు తెలిపింది.

అదేవిధంగా... బలుచిస్తాన్ లోని క్వెట్టాలో తమ యోధులు రంగంలోకి దిగారని.. ఈ సమయంలో పాక్ దళాల ఫ్రాంటియర్ కార్ప్స్ కార్యాలయంపై దాడి చేశారని.. దీంతో పాక్ సైన్యం పారిపోయిందని.. ఫలితంగా క్వెట్టాను ఆక్రమించుకున్నామని బీ.ఎల్.ఏ. తెలిపింది. ఈ సమయంలో పాక్ మూడో శత్రువు ఎంట్రీ ఇచ్చింది.

అవును... పాక్ కు భారత్ ముచ్చెమటలు పట్టిస్తోన్న వేళ.. అదే పాక్ కు పక్కలో బల్లెంలా, పరోక్షంగా భారత్ కు ఉడత సాయం చేస్తున్నట్లుగా బలూచిస్తాన్ తన పని తాను చేసుకుపోతుంది. ఇదే సమయంలో తాజాగా పాక్ మరో పక్కలో బల్లెం అయిన తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) ఫైటర్లు రంగంలోకి దిగారు. పాక్ కు బిగ్ షాకిచ్చారు.

ఇందులో భాగమా.. లేజర్ రైఫిళ్లతో టీటీపీ ఫైటర్లు సుమారు 20 మంది పాకిస్థాన్ ఆర్మీ సైనికులను చంపేశారు! దీంతో... పాక్ కు మూడో ఎనిమీ కూడా ఎంట్రీ ఇచ్చి పని మొదలుపెట్టిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో.. పాక్ కు ఇంటా బయటా ఉమ్మడి వాయింపే అని అంటున్నారు నెటిజన్లు.

కాగా... పాకిస్థాన్ లోని ఉగ్రసంస్థ అయిన తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్థాన్ కు ఆఫ్ఘనిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో సుమారు ఏడాది కాలంగా పాక్ ఆర్మీ, టీటీపీ మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజా దాడులు జరిగి ఉంటాయని అంటున్నారు.