Begin typing your search above and press return to search.

దాయాది ఎంత డేంజరో చెప్పిన కీలక దేశాలు

పాకిస్తాన్ పాపాల పుట్ట పగులుతుంది. ఇంతకాలం దాయాది దుర్మార్గాల్ని ప్రపంచ వేదికలపై ఎలుగెత్తిన భారత సర్కారుకు ఇప్పుడు కొత్త మద్దతు సమకూరుతోంది

By:  Tupaki Desk   |   1 May 2025 9:32 AM IST
దాయాది ఎంత డేంజరో చెప్పిన కీలక దేశాలు
X

పాకిస్తాన్ పాపాల పుట్ట పగులుతుంది. ఇంతకాలం దాయాది దుర్మార్గాల్ని ప్రపంచ వేదికలపై ఎలుగెత్తిన భారత సర్కారుకు ఇప్పుడు కొత్త మద్దతు సమకూరుతోంది. ప్రపంచంలోనే అత్యంత అపాయకర దేశం పాకిస్తాన్ అంటూ..కీలక దేశాలైన రష్యా.. యూకేలు వ్యాఖ్యానించటం అంతర్జాతీయంగా ఇప్పుడు సంచలనమైంది. 2019 ఫిబ్రవరిలో జమ్మూ కశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన దాడికి కారణమైన లష్కర్.. జైషే వంటి ఉగ్రసంస్తలకు పాకిస్తాన్ నిధులు.. శిక్షణ శిబిరాల్ని సమకూర్చినట్లుగా పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని పాక్ స్పాన్సర్ చేస్తుందన్న విషయాన్ని చూపేందుకు అవసరమైన తగిన ఆధారాలు ఉన్నట్లుగా రష్యా.. యూకే ప్రభుత్వాలు చెబుతున్నాయి. ముంబయిలో జరిగిన 26/11 దాడులతో సహా అంతకు ముందు జరిగిన అనేక ఉగ్రదాడులకు పాకిస్తాన్ మద్దతు ఇచ్చిన విషయాన్ని యూకే.. రష్యాలు గుర్తించాయి. ఈ సందర్భంగా తమ వాదనకు బలం చేకూరే ఉదాహరణను ప్రస్తావిస్తున్నారు. అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ను 2011లో అమెరికా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ లో పాక్ లోని అబోటాబాద్ లోని ఒక స్థావరంలో లాడెన్ ను గుర్తించటం.. అక్కడికక్కడే హతమార్చిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు.

2008, 2011లో కాబుల్ లోని భారత.. అమెరికా రాయబార కార్యాలయాలపై దాడులు.. 2024లో మాస్కోలోని ఒక కల్చర్ కేంద్రంపైనా దాడులు.. 2005లో లండన్ మొత్తం బాంబుదాడుల్లాంటి దుర్మార్గపు పనుల వెనుక ఉగ్రవాదులు కనిపిస్తున్నప్పటికి.. వారికి అండగా నిలిచింది పాక్ ప్రభుత్వమేనని చెబుతున్నారు. మొత్తంగా పాక్ పాడు పనులు ప్రపంచానికి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నట్లుగా చెప్పక తప్పదు.