Begin typing your search above and press return to search.

ఉగ్రవాదులతో పాక్ (అక్రమ) బంధం... క్లారిటీ ఇచ్చిన చిత్రం!

ఉగ్రవాదానికి అతిపెద్ద అడ్డాగా.. ఉగ్రవాదులకు అతి సేఫ్ జోన్ గా.. ఉన్న దేశాల్లో పాకిస్థాన్ ఫస్ట్ లిస్ట్ లో ఉంటుందనే సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 May 2025 6:20 PM
ఉగ్రవాదులతో పాక్  (అక్రమ) బంధం... క్లారిటీ ఇచ్చిన చిత్రం!
X

ఉగ్రవాదానికి అతిపెద్ద అడ్డాగా.. ఉగ్రవాదులకు అతి సేఫ్ జోన్ గా.. ఉన్న దేశాల్లో పాకిస్థాన్ ఫస్ట్ లిస్ట్ లో ఉంటుందనే సంగతి తెలిసిందే. ఉగ్రవాదులకు పాకిస్థాన్ అత్యంత అనువైన స్థలంగా చెబుతారు. అయితే పాక్ నేతలు మాత్రం... తాము కూడా ఉగ్రవాద బాధితులమే అని నిస్సిగ్గు వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ సమయంలో ఓ ఫోటో పాక్ వైఖరిపై ప్రపంచానికి మరోసారి క్లారిటీ ఇచ్చింది.

అవును... పాకిస్థాన్ కు ఉగ్రవాదులకు ఉన్న అవినాభావ (అక్రమ) సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు! ప్రపంచంలో ఉగ్రవాదం ఇంకా మనగ గలుగుతుందంటే అందుకు పాక్ కూడా ఓ ప్రధాన కారణం అని చెబుతారు. ఇక ప్రధానంగా పాక్ లో ఉన్న ఉగ్రమూకలకు భారత్ ఓ టార్గెట్! ఇటీవల పహల్గాంలో జరిగిన పాశవిక దాడి అందుకు ఓ తాజా ఉదాహరణ.

ఈ సమయంలో ఉగ్రవాదులతో అవిభక్త కవలగా ఉన్న పాక్ ఆర్మీతో.. ఈ విషయంలో మాటలు కంటే చేతలతో చెప్పే సమాధానమే సరైంది అని భావించిన భారత్... ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. సుమారు 80 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది. నేరుగా పాక్ లోని పంజాబ్ లో ఉన్న స్థావరాలను నేలమట్టం చేసింది.

ఈ సమయంలో మరణించిన ఉగ్రవాదులకు బుధవారం అంత్యక్రియలు జరిగాయి. ఇందులో భాగంగా... లాహోర్ సమీపంలోని మురిద్కేలోని ఉగ్రవాద సంబంధిత ప్రదేశంలో భారత సైనిక దాడుల్లో మరణించిన ముగ్గురు వ్యక్తుల అంత్యక్రియల్లో ప్రార్థనలకు లష్కరే తోయిబా (ఎల్.ఈ.టీ) ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రవూఫ్ నాయకత్వం వహించాడు.

ఇలా అతడు నాయకత్వం వహించిన ఉగ్రవాదుల అంత్యక్రియల కార్యక్రమంలో పాకిస్థాన్ ఆర్మీ సిబ్బంది, పోలీసులు పాల్గొనడం గమనార్హం. దీనికి సంబంధించిన ఫోటో పాక్ కి ఉగ్రవాదులకు ఉన్న బంధాన్ని చెప్పకనే చెబుతుందనీ అంటున్నారు. ఇదే సమయంలో మురిడ్కేలో మరో ఉగ్రవాది శవపేటికలను పాక్ జెండా చుట్టి మరీ ఆ దేశ ఆర్మీ సిబ్బంది మోస్తూ కనిపించారు.

దీంతో... దీనికి సంబంధించిన ఫోటోలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. పాకిస్థాన్ లో ఉగ్రవాదులు ఓ అంతర్భాగమని ఒకరంటే.. పాక్ సైన్యంతో ఉగ్రవాదులది అక్రమ సంబంధం అని మరొకరు స్పందిస్తున్నారు. ఇదే సమయంలో... ఈ ఫోటోలు ప్రపంచం ముందు పెట్టాలని, ఐరాసలో ప్రదర్శించాలని మరికొంతమంది సూచిస్తున్నారు.